బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ యాదవ్( Satyakumar Yadav ) కారుపై రాళ్ల దాడి జరిగింది.నేడు అమరావతి రైతులు చేపట్టిన ఉద్యమం 1200వ రోజు కావటంతో… మందడంలో కోనసాగుతున్న నిరసన కార్యక్రమంలో వైసీపీ( YCP ) మినహా మిగతా పార్టీల నేతలు హాజరయ్యారు.
అయితే ఈ కార్యక్రమంలో పాల్గొని అనంతరం తిరుగు ప్రయాణం చేస్తున్న బీజేపీ నేత సత్య కుమార్ యాదవ్ ప్రయాణిస్తున్న కారుపై రాళ్ల దాడి జరిగింది.దాడి జరిగిన అనంతరం సత్యకుమార్, ఆదినారాయణ రెడ్డి మిగతా బీజేపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించి ఇది వైసీపీ కార్యకర్తల దాడి అని అన్నారు.
పరిస్థితి ఇలా ఉండగా ఈ దాడి పై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు( Somu Viraraju ) స్పందించారు.తమ పార్టీ నేత వాహనంపై వైసీపీ నేతల రాళ్లదాడిని ఖండింస్తున్నట్లు తెలిపారు.సత్య కుమార్ పై రాళ్లదాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.ఉద్దేశపూర్వకంగానే బీజేపీ నేతలపై ఈ రాళ్లదాడి జరిగినట్లు భావిస్తున్నట్లు స్పష్టం చేశారు.
పోలీసుల నిర్లక్ష్యం వల్లే వైసీపీ కార్యకర్తలు రాళ్ళ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు.ఈ పద్ధతిలో దాడులు దిగజారుడు రాజకీయం కాదా అని ప్రశ్నించారు.
ఈ ఘటనకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని సోము వీర్రాజు.వైసీపీనీ హెచ్చరించారు.