కనెక్టికట్ తొలి అసిస్టెంట్ పోలీస్ చీఫ్‌గా భారతీయ సంతతి మహిళ ఎంపిక..

భారతీయ సంతతికి చెందిన సిక్కు మహిళ మన్మీత్ కోలన్( Manmeet Colon ) అరుదైన ఘనత సాధించారు.ఆమె యూఎస్‌, కనెక్టికట్‌ రాష్ట్రం,( Connecticut ) న్యూ హెవెన్ సిటీలో మొదటి భారతీయ-అమెరికన్, రెండవ మహిళా అసిస్టెంట్ పోలీస్ చీఫ్ ఆఫ్ కలర్‌గా( Assistant Police Chief ) నియమితులయ్యారు.

 Indian-origin Sikh Woman Manmeet Colon Takes Oath As Assistant Police Chief In C-TeluguStop.com

గతంలో అంతర్గత వ్యవహారాల కార్యాలయంలో లెఫ్టినెంట్‌గా పని చేసిన కోలన్‌ను న్యూ హెవెన్‌లోని బోర్డ్ ఆఫ్ పోలీస్ కమిషనర్లు ఏకగ్రీవంగా ఆమోదించారు.

మన్మీత్ 11 ఏళ్ల వయస్సులో ముంబై నుంచి షిఫ్ట్ అయిన తర్వాత క్వీన్స్‌లో పెరిగింది.

న్యూ హెవెన్ యూనివర్సిటీలో క్రిమినల్ జస్టీస్‌ని అభ్యసించారు.లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో కెరీర్ కొనసాగించడానికి తన నియామకమే ఇతరులకు స్ఫూర్తినిస్తుందని మన్మీత్ ఆశిస్తున్నారు.

న్యూ హెవెన్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఆమె తన పదవీకాలంలో పెట్రోల్, డిటెక్టివ్, అంతర్గత వ్యవహారాల విభాగం అధిపతితో సహా పలు స్థానాల్లో పనిచేశారు.డిపార్ట్‌మెంట్‌లో ప్రస్తుతం 17% మంది మహిళలు ఉన్నారు.కోలన్ నియామకం మరింత మంది మహిళలు చేరడానికి ప్రేరణనిస్తుందని పోలీసు చీఫ్ కార్ల్ జాకబ్సన్ పేర్కొన్నారు.

మన్మీత్‌తో మేయర్ జస్టిన్ ఎలిక్కర్ ఈ నెల ప్రారంభంలో ప్రమాణ స్వీకారం చేయించారు.కోలన్ కుమార్తె తన తల్లి యూనిఫాంపై కొత్త అసిస్టెంట్ చీఫ్ బ్యాడ్జ్‌ను పిన్ చేసి ఉంచారు.పోలీస్ కమిషన్ చైర్ ఎవెలిస్ రిబీరో దీనిని న్యూ హెవెన్ నగరానికి గొప్ప రోజు అని, నగరం… రాష్ట్రంలోని భారతీయ సమాజానికి, మహిళలకు గర్వించదగిన విషయమని అన్నారు.

ఇకపోతే భారత సంతతికి చెందిన ఎంతోమంది అమెరికాతో పాటు అభివృద్ధి చెందిన అనేక దేశాల్లో గొప్ప పదవులు సాధిస్తూ భారతీయులకు గర్వకారణంగా నిలుస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube