మనిషి డబ్బు కోసం, శారీరక సుఖం కోసం రకరకాల చెడు మార్గాలను ఎంచుకుని చివరికి జైలు పాలు కావడం, హత్యకు గురవడం జరుగుతున్న సమాజంలో మార్పు రాకపోగా క్రమంగా దారుణాలు పెరుగుతూ పోతున్నాయి.ఈ క్రమంలోనే రెండవ భార్య చేతిలో డీఏఆర్ పోలీస్ కానిస్టేబుల్ దారుణ హత్యకు గురయ్యాడు.
వివరాల్లోకి వెళితే జాఫర్ సాబ్( Zafar saab ) (37) బళ్లారి నగరంలో డీఏఆర్ పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు.జాఫర్ సాబ్ కు, నబీనా అనే యువతితో వివాహం అయ్యింది.
అయితే భార్యను వదిలిపెట్టి గత 8 ఏళ్ల నుండి నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్న హనుమక్క అనే నర్సును రెండో వివాహం చేసుకున్నాడు.వీరిద్దరికీ ఒక కుమారుడు సంతానం.
జాఫర్ సాబ్ తన మొదటి భార్య నబీనా ( Nabeena )వద్దకు రహస్యంగా వెళుతూ ఉండేవాడు.ఈ విషయం రెండవ భార్య హనుమక్కకు తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు జరగడం ప్రారంభమైంది.తాజాగా తన భర్త మొదటి భార్య దగ్గరకు వెళ్లి రావడంతో హనుమక్క( Hanumakka ) గొడవ చేయడం మొదలుపెట్టింది.దీంతో జాఫర్ సాబ్ భార్యపై చేయి చేసుకున్నాడు.
క్షణికావేశంలో హనుమక్క పక్కనే ఉన్న ఇనుప రాడ్డుతో భర్త తలపై బలంగా కొట్టడంతో వెంటనే స్పృహ తప్పి పడిపోయాడు.చుట్టుపక్కల ఉండే వారి సహాయంతో జాఫర్ సాబ్ ను ఆసుపత్రిలో చేర్పించగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు.
జాఫర్ సాబ్ సోదరి జరీనా ఫిర్యాదు మేరకు గాంధీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని హనుమక్కను అదుపులోకి తీసుకున్నారు.సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ రంజిత్ కుమార్ బండరీ తో పాటు డీఎస్పీ, గాంధీ నగర్ ఎస్సై నాగరాజు పరిశీలించి ఇది హత్యేనని గుర్తించారు.
జాఫర్ సాబ్ 2008 బ్యాచ్ కు చెందినవారు.ఈయన స్వస్థలం కంప్లి తాలూకా మెట్రి సమీపంలోని చిన్నాపురం.మొదటి భార్యకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.రెండవ భార్యకు ఒక కుమారుడు సంతానం.