ఇందిరమ్మ కాలనీ లో బోర్ మోటార్ ప్రారంభం.

ఇందిరమ్మ కాలనీ చైర్మన్ ను అభినందించిన కాలనీవాసులు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కిషన్ దాస్ పేట ఇందిరమ్మ కాలనీ లో రియల్ ఇండియా మినిస్ట్రీ వారి ఆద్వర్యంలో వేసిన బోర్ మోటార్ ను మండల కో ఆర్డినేటర్ మధు,ఇందిరమ్మ కాలనీ డెవలప్ మెంట్ కమిటీ చైర్మన్ ఒగ్గు బాలరాజు యాదవ్ ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ మోటార్ ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఇందిరమ్మ కాలనీ డెవలప్ మెంట్ కమిటీ చైర్మన్ ఒగ్గు బాలరాజు యాదవ్ మాట్లాడుతూ ఇందిరమ్మ కాలనీ లో తాగునీటి సమస్య ఉందని రియల్ ఇండియా మినిస్ట్రీ మండల కో ఆర్డినేటర్ మధు దృష్టికి తీసుకెళ్లగా బోర్ మోటార్ వేయించడం జరిగింది.

 Bore Motor Started In Indiramma Colony , Indiramma Colony, Kishan Das, Bala Raja-TeluguStop.com

దీంతో తాగునీటి ఎద్దడి నివారించినట్లైనదని అన్నారు.అదే విధంగా బోర్ లో మోటార్ ను దింపడానికి మోటార్ ను సమకూర్చిన తన క్లాస్ మేట్ చేయూత మిత్ర ఫౌండేషన్ అధ్యక్షుడు,బీజే వై ఎం జిల్లా నాయకులు దూస శ్రీనివాస్ కు,రియల్ ఇండియా మినిస్ట్రీ మండల కో ఆర్డినేటర్ మధు కు ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ శాలువా కప్పి సన్మానించి ధన్యావాదాలు తెలిపారు.

తాను ఇందిరమ్మ కాలనీ లో మరిన్ని సౌకర్యాలు కల్పించడానికి కృషి చేస్తానని ఇందిరమ్మ కాలనీ డెవలప్ మెంట్ కమిటీ చైర్మన్ ఒగ్గు బాలరాజు యాదవ్ అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ తో పాటు ఇందిరమ్మ కాలనీ ప్రజలు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube