అకాల వర్షం అపార నష్టం

పంట పొలాలను పరిశీలించిన బిజెపి నాయకులు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల భారతీయ జనతా పార్టీ ( Bharatiya Janata Party )మండల కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో అకాల వర్షం,రాళ్ల వర్షానికి పంట నష్టపోయిన గ్రామాలను ఆదివారం సందర్శించారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంతోపాటు కోరుట్లపేట,వెంకటాపూర్, గొల్లపల్లి,బొప్పాపూర్ గ్రామాలలో శనివారం వడగండ్ల వాన పడడంతో నష్టపోయిన అన్నదాతల పంట పొలాలను పరిశీలించారు.

 Untimely Rain Is A Huge Loss , Bharatiya Janata Party, Kisan Morcha, Korutlapeta-TeluguStop.com

ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ ఈ సీజన్ లో పంటకు తెగుళ్ళు తగిలి రైతులు పురుగుల మందులు కొట్టాలేక చాలా అవస్థలు పడ్డారనీ అన్నారు .కనీసం పెట్టుబడి అయిన వస్తది అని ఆశతో చూస్తున్న రైతులకు ఈ అకాల వర్షం కన్నీరే మిగిల్చిందని,ఈ అకాల వర్షంతొ నష్టపోయిన పంట నష్టంను సర్వే చేయించాలని బిజెపి పక్షాన ప్రభుత్వాన్ని కోరారు.ప్రతిసారి అకాల వర్షానికి పంట నష్టపోయి రైతులకు నష్టం జరుగుతున్న ప్రభుత్వం హడావుడి మీద ఎంత మేరకు పంట నష్టం జరిగిందో రాసుకోవడం తప్ప తర్వాత పట్టించుకునే వారు లేరని బిజెపి నాయకులు ఆరోపించారు.అలాగే మీది రైతు ప్రభుత్వం అయితే గతంలో ఎల్లారెడ్డిపేట మండలం అక్కపళ్లి లో వర్షానికి దెబ్బ తిన్న పంట పొలాలకు జరిగిన నష్టాన్నీ రికార్డు చేసుకుని వెళ్లారే తప్ప ఇప్పటికి కూడా పరిహారం అందలించలేదని ఆరోపించారు.

అకాల వర్షాలు విపత్తులు వచ్చిన సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా ద్వారా రైతులకు లబ్ధి జరిగే అవకాశం ఉన్న ఫసల్ బీమాను రాష్ట్రంలో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.ఇప్పటికైనా రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమాను ప్రారంభించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

లేనియెడల రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి,కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు కొండాపురం సత్యం రెడ్డి,మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతిరెడ్డి, పిట్ల శ్రీశైలం, కిషన్ రెడ్డి,హైమద్, మేడిశెట్టి బాలయ్య,గెంటే రవి, గుర్రాల రాజిరెడ్డి, ధనాల దేవయ్య, వంగ బాపురెడ్డి రైతులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube