మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( ram charan ) ప్రస్తుతం శంకర్( shankar ) దర్శకత్వం లో ఒక సినిమా ను చేస్తున్న విషయం తెల్సిందే.దిల్ రాజు( Dil Raju ) నిర్మిస్తున్న ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.
మొదటగా ఈ ఏడాది లోనే చరణ్, శంకర్ కాంబో సినిమా ను విడుదల చేయాలని నిర్మాత దిల్ రాజు భావించాడు.కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
మరీ ఇంత ఆలస్యం అవ్వడానికి కారణం దర్శకుడు శంకర్ మరో వైపు కమల్ హాసన్ తో ఇండియన్ 2 సినిమా ను చేస్తున్నాడు.చరణ్ తో సినిమా ను మొదలు పెట్టిన తర్వాత ఇండియన్ 2 ను మళ్లీ మొదలు పెట్టాల్సి వచ్చింది.
దాంతో రెండు సినిమా లను బ్యాలన్స్ చేస్తూ దర్శకుడు శంకర్ సినిమా లు చేస్తూ వస్తున్నాడు.
చరణ్ సినిమా మొదట వస్తుందని అంతా ఆశించారు.కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇండియన్ 2 సినిమా మరీ ఆలస్యం అవ్వడం లేదట.అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఇండియన్ 2 ను ఇదే ఏడాది లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని భావిస్తున్నారు.
అతి త్వరలోనే ఇండియన్ 2 యొక్క విడుదల తేదీని అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.శంకర్ గతంలో ఇండియన్ సినిమా చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.
కనుక ఇండియన్ 2 అంతకు మించి అన్నట్లుగా ఉంటుందనే నమ్మకం ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు.దేశ వ్యాప్తంగా మంచి మార్కెట్ ఉన్న శంకర్ మరియు కమల్ హాసన్ ల మూవీ భారీ గా విడుదల అవ్వబోతుంది.
ఆ తర్వాత చరణ్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు శంకర్ వస్తాడు.ఈ సినిమా లో చరణ్ కి జోడీగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే.