ప్రపంచం ఇపుడు స్మార్ట్ స్మార్ట్ గా అయిపోతోంది.నిన్న మొన్నటివరకు స్మార్ట్ ఫోన్స్ ( Smart phones )వెంబడి పడే ప్రజానీకం ఇపుడు స్మార్ట్ వాచ్ ( Smart watch )లపైన దృష్టి సారించారు.
ఈ క్రమంలోనే ప్రముఖ స్మార్ట్ వాచ్ తయారీ సంస్థ అయినటువంటి నాయిస్( noise ).చిన్న పిల్లల కోసం ఓ సరికొత్త స్మార్ట్ వాచ్‌ను రూపొందించింది.నాయిస్ స్కౌట్ ( Noise Scout )పేరుతో లాంచ్ చేసిన ఈ వాచ్ కచ్చితంగా వినియోగదారులను ఆకట్టుకుంటుందని కంపెనీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి.జియో-ఫెన్సింగ్, బిల్ట్-ఇన్ సిమ్ కనెక్టివిటీ, ఎస్ఓఎస్ వంటి ఫీచర్లతో పిల్లలు ఆరుబయట అన్వేషించడానికి వీలు కల్పించేలా దీన్ని రూపొందించడం విశేషం.

విషయం ఏమంటే తల్లిదండ్రులు తమ పిల్లల కార్యకలాపాలను సులభంగా దీనిగుండా ట్రాక్ చేసుకొనే వీలుంది.ఈ నెల ప్రారంభంలోనే నాయిస్ హెచ్‌ఆర్‌ఎక్స్ బౌన్స్ స్మార్ట్ వాచ్‌ను కంపెనీ విడుదల చేయడం జరిగింది.రూ.5999కు అమెజాన్, నాయిస్ వెబ్‌సైట్స్‌లో ఈ వాచ్ అందుబాటులో వుంది… ఒకసారి చూడండి.పిల్లలు వారి రోజువారీ పనులను చేసేలా రిమైండర్‌తో వస్తుంది.పళ్లు తోముకోవడం, హోంవర్క్ పూర్తి చేయడం వంటి కార్యకలాపాల కోసం సకాలంలో రిమైండర్‌లను కూడా ఇందులో సెటప్ చేయవచ్చు.
అంతేకాకుండా పిల్లల హృదయ స్పందన రేటు, నిద్ర విధానాలను పర్యవేక్షించడానికి వివిధ ఆరోగ్య రిమైండర్‌లను అందిస్తుంది.

ఇకపోతే, నాయిస్ స్కౌట్ ఫీచర్ల విషయానికొస్తే… 1.4 అంగుళాల హెచ్‌డీ టీఎఫ్‌టీ ఎల్‌సీడీ స్క్రీన్ 240×240 రిజల్యూషన్ కలిగి వుంది.అంతేవిధంగా 2 ఎంపీ ఇన్‌బుల్ట్ కెమెరా సెటప్, 4జీ వీడియో మరియు వాయిస్ కాలింగ్, యాక్సిలెరోమీటర్, జీపీఎస్ సెన్సార్లు వున్నాయి.
అలాగే 680ఎంఏహెచ్ బ్యాటరీ, 28 రోజుల స్టాండ్‌బై ఫీచర్, మల్టీస్పోర్ట్ ట్రాకర్, అలారం క్లాక్, యాక్టివిటీ ట్రాకర్, క్యాలరీ ట్రాకర్, హార్ట్ రేట్ మానిటర్, అంతర్నిర్మిత గేమ్‌లు, స్కూల్ మోడ్ ఇవకా మరెన్నో ఫీచర్లు వున్నాయి.ఇకపోతే ఇది నాయిస్ బడ్డీ యాప్ సపోర్ట్ కలిగి ఉండి ఐపీ 68 వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది.