22-23 ఆర్థిక సంవత్సరం ఈ మార్చితో దిగ్విజయంగా ముగియనుంది.ఈ క్రమంలో 2023 ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్డీఈ నిబంధనలు కార్లకు వర్తిస్తాయని మీకు గుర్తు వుంది కదా.
ఈ నేపథ్యంలో చాలా కంపెనీలు తమ కార్ల స్టాక్‌ను క్లియర్ చేసే ప్రయత్నంలో మునిగిపోయాయి.ఇది కస్టమర్లకు ఓ విధంగా మంచి సమయం అని చెప్పొచ్చు.
ముఖ్యంగా కొత్త ఎస్‌యూవీని ( SUV ) ఎవరైతే కొనుగోలు చేయాలని చూస్తారో వారికి ఇది గొప్ప అవకాశం.అవును, ఈ నెలలో పలు ఎస్‌యూవీలు 3 లక్షల రూపాయల వరకు తగ్గింపును కలిగి ఉన్నాయి.
మీరు కూడా కొత్త ఎస్‌యూవీ కొనాలనుకుంటే.ఈ మార్చిలో కొనేసుకోండి తొందరగా.

ఇక కొత్త ఎస్‌యూవీని ఎవరైతే కొనుగోలు చేయాలని అనుకుంటారో వారు “సిట్రోయెన్ సి5 ఎయిర్ క్రాస్”( Citroen C5 Aircross ) ట్రై చేయొచ్చు.సిట్రోయెన్ ఇటీవలే సిట్రోయెన్ C5 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీ యొక్క కొత్త వెర్షన్‌ను మార్కెట్లోకి దించింది.అందుకని పాత మోడల్ యూనిట్ల కొనుగోలుపై దాదాపుగా రూ.3 లక్షల వరకు తగ్గింపును అందిస్తోంది.ఇక C5 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీ యొక్క ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.37.17 లక్షలుగా ఉంది.ఆ తరువాత “జీప్ మెరిడియన్”( Jeep Meridian ) చాలా బావుంటుంది.
ఇది ఒక అమెరికన్ ఎస్‌యూవీ అని మీకు తెలిసినదే.కాగా ఈ కారు పలు వేరియంట్‌లపై రూ.2.5 లక్షల వరకు తగ్గింపును అందిస్తున్నారు.దీని ధరలు రూ.30.10 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి.

వీటి తరువాత చెప్పుకోదగ్గ కొత్త ఎస్‌యూవీ “వోక్స్‌వ్యాగన్ టిగువాన్” ఇది భారతీయ మార్కెట్లో జీప్ మెరిడియన్ మరియు స్కోడా కొడియాక్‌లతో పోటీ పడుతుండడం విశేషం.ఈ ఎస్‌యూవీపై కంపెనీ రూ.1.85 లక్షల వరకు తగ్గింపు వుంది.దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.33.49 లక్షలు.ఈ లిస్టులో నాల్గవది “జీప్ కంపాస్.” ఈ ఎస్‌యూవీ కొనుగోలుపై రూ.1.5 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు.జీప్ కంపాస్ ఎస్‌యూవీ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.20.99 లక్షలుగా వుంది.ఇక చివరగా “ఎంజీ ఆస్టర్” ఒకటి.మార్చి నెలలో ఈ ఎస్‌యూవీ కొనుగోలుపై కంపెనీ రూ.1.5 లక్షల వరకు తగ్గింపు ప్రకటించింది.ఎంజీ ఆస్టర్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.10.51 లక్షలుగా ఉంది.







