బాలీవుడ్ స్టార్ హీరో ల పరిస్థితి ఈ మధ్య అసలు బాలేదు.ఒకప్పుడు వందల కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదు చేసిన స్టార్ హీరోలు ఇప్పుడు కనీసం 10 నుండి 20 కోట్ల రూపాయలు కలెక్షన్స్ నమోదు చేయడం కూడా కష్టంగా మారింది.
ఆ జాబితా లో ముందు వరుసలో ఉండే హీరో అక్షయ్ కుమార్.బాలీవుడ్ ఖిలాడి అంటూ పేరు సొంతం చేసుకున్న అక్షయ్ కుమార్ గతంలో వరుసగా పది సినిమాలతో రూ.100 కోట్లు ఆపై కలెక్షన్స్ సొంతం చేసుకున్నాడు.ప్రపంచంలో అత్యధిక సంపద కలిగిన హీరోగా కూడా ఒకానొక సమయం లో నిలిచిన అక్షయ్ కుమార్ ఇప్పుడు అత్యంత దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు.వరుసగా 6.7 సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి.రూ.100 కోట్ల హీరో అంటూ ఒకప్పుడు పేరు సంపాదించుకుని ఇప్పుడు కనీసం పాతిక కోట్ల రూపాయల కలెక్షన్స్ కూడా నమోదు చేయలేక పోతున్న అక్షయ్ కుమార్ ని చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
మరి ఇంత దారుణమైన పరిస్థితి గతంలో ఏ హీరో కి కూడా వచ్చి ఉండదు అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఏడాదికి నాలుగైదు సినిమాలు విడుదల చేయడమే లక్ష్యంగా అక్షయ్ కుమార్ పని చేస్తున్నాడు తప్పితే మంచి సినిమాలు చేయాలనే ఉద్దేశం ఆయనకు ఉన్నట్లుగా అనిపించడం లేదని కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి దేశం లోనే అత్యంత చెత్త రికార్డు ని అక్షయ్ కుమార్ సొంతం చేసుకున్నాడు.
అతి తక్కువ సమయం లోనే ఎన్నో వందల కోట్ల సినిమాలను సొంతం చేసుకున్న అక్షయ్ కుమార్ గత మూడు సంవత్సరాల్లో 10 సినిమాలతో బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్ల పడ్డాడు.అందులో ఒకటి రెండు కూడా మినిమం కలెక్షన్స్ నమోదు చేయలేక చేయింది.ముందు ముందు అయినా ఆయన సినిమాలు సక్సెస్ అవుతాయి అనే నమ్మకం లేదు అంటూ కొందరు పెదవి విరుస్తున్నారు.
అక్షయ్ కుమార్ అభిమానులు మాత్రం తమ అభిమాన హీరో మళ్లీ పుంజుకుంటాడని నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.