సాధారణంగా ప్రతి ఒక్క పోషకం మన శరీరానికి ఎంతో అవసరం.ఏదైనా ఒక వస్తువు పరిమాణం తక్కువగా లేదా ఎక్కువగా ఉంటే అనేక వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది.
విటమిన్ B-12 మన శరీరానికి ఎంతో ముఖ్యమైనది.ఇది మన శరీరంలో అనేక కీలకమైన పనులను చేస్తుంది.
మన శరీరం విటమిన్B-12 ను స్వయంగా తయారు చేసుకోదు.కాబట్టి ఈ విటమిన్ ఆహారం ద్వారా తీసుకోవడం మంచిది వారి ఆహారంలో ఇలాంటి ఆహార పదార్థాలను చేర్చుకోవడం మంచిది.
దానివల్ల ఈ పోషకం యొక్క లోపాన్ని తగ్గించవచ్చు.విటమిన్ బి 12 లో ఉండే ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.విటమిన్ B12 కణాల నిర్మాణంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.ఇది చర్మం,గోళ్ళు మరియు జుట్టును కూడా బలంగా ఉండేలా చేస్తుంది.
దీన్ని వాడడం వల్ల ఎముకలకు సంబంధించిన వ్యాధులు దూరమవుతాయి.విటమిన్ బి12 ఎర్ర రక్త కణాలను తయారు చేయడంలో ఎంతగానో సహాయపడుతుంది.
దీని లోపం కారణంగా ఎర్ర రక్త కణాలు అనియంత్రిత పరిమాణం లో ఏర్పడడం మొదలవుతాయి.ఇది మెగాలోబ్లాస్టిక్ అనీమియాకు దారి తీసే అవకాశం ఉంది.విటమిన్ బి12 లోపాన్ని దూరం చేసుకోవడానికి మనం రోజు వారి ఆహారంలో వీటిని కచ్చితంగా చేసుకోవాలి. చేపలలో విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది.చేపలను తినడం వల్ల శరీరంలోని బి12 లోపాన్ని తగ్గించవచ్చు.
ట్యూనా మరియు సాల్మన్ చేపలలో విటమిన్ బి12 అధికంగా ఉంటుంది.విటమిన్ బి 12 చికెన్ మరియు మాంసంలో కూడా అధికంగా ఉంటుంది.విటమిన్ బి12 లోపాన్ని పాలు మరియు పెరుగు, పన్నీర్ లాంటి మొదలైన పాల ఉత్పత్తుల ద్వారా కూడా తగ్గించుకోవచ్చు.
విటమిన్ బి 12 బ్రోకలీ,తాజా కూరగాయలలో కూడా ఉంటుంది.అంతేకాకుండా సోయాబీన్ మరియు వోట్స్ వంటి తృణధాన్యాలలో కూడా అధికంగా లభిస్తుంది.