నందమూరి ఫ్యామిలీ నుండి మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.హీరోగా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి ఫ్యాన్స్ ఏ స్థాయి లో ఎదురు చూస్తున్నారో అదే స్థాయి లో ఇతర హీరోల అభిమానులు కూడా వెయిట్ చేస్తున్నారు అనడంలో సందేహం లేదు.
హీరోగా నందమూరి ఫ్యామిలీ నుండి ఇప్పటికే చాలా మంది హీరోలు ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే.మోక్షజ్ఞ కూడా నందమూరి ఫ్యామిలీ ఫ్యాన్స్ ను మరియు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయబోతున్నట్లుగా బాలకృష్ణ ప్రకటించాడు.
ఆ మధ్య మోక్షజ్ఞ కోసం కథలు వింటున్నట్లుగా కూడా బాలయ్య పేర్కొన్నాడు.మొత్తానికి బాలకృష్ణ అభిమానులను ఉత్సాహ పర్చుతూ మోక్షజ్ఞ ఎంట్రీ గురించి క్లారిటీ ఇస్తూ వచ్చాడు.
అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా మోక్షజ్ఞ మొదటి సినిమా ఉండాలని బాలయ్య భావిస్తున్నాడు.
అందుకోసం ఎంతో మంది చెప్పిన కథలు విన్న బాలయ్య ఆ మధ్య అనిల్ రావిపూడి చెప్పిన కథను కూడా విన్నాడని తెలుస్తోంది.ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా లో బాలయ్య నటిస్తున్న విషయం తెల్సిందే.ఆ సినిమా లో ను దసరా కానుకగా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటే కచ్చితంగా మోక్షజ్ఞ బాధ్యతను అనిల్ రావిపూడికి ఇచ్చేందుకు గాను బాలయ్య ఓకే చెప్పినట్లుగా సమాచారం అందుతోంది.అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా బాలయ్య సినిమా ఉంటుందని అంతా చాలా నమ్మకంతో ఉన్నారు.
ఒక వేళ అనిల్ రావిపూడి దర్శకత్వంలో కనుక మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటే కచ్చితంగా ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరిని కూడా కుమ్మేసే అవకాశాలు ఉన్నాయి అంటూ అభిప్రాయం వ్యక్తం అవుతోంది.బాలయ్య సినిమా తర్వాత అనిల్ రావిపూడి సినిమా విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.