సౌత్ ఆఫ్రికా వేదికగా జరుగుతున్న ఉమెన్ టీ20 వరల్డ్ కప్ లో భాగంగా సెమీఫైనల్ లో ఆస్ట్రేలియా- ఇండియా మ్యాచ్ తో ఐదు పరుగుల తేడాతో భారత్ పరాజయం పొందిన సంగతి తెలిసిందే.కేప్ టౌన్ లోని న్యూ ల్యాండ్స్ స్టేడియంలో జరిగిన సెమిస్ లో కేవలం ఐదు పరుగుల తేడా వల్ల ఫైనల్లోకి చేరలేకపోయింది.173 పరుగుల లక్ష్యంలో బరిలోకి దిగిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్ కోల్పోయి 167 పరుగులు చేసింది.
మ్యాచ్ మాత్రం చాలా ఉత్కంఠ భరితంగా సాగుతూ ఇరుజట్లు గెలుపు కోసం చివరి బంతి వరకు పోరాటం చేశాయి.
ఇక చివరి ఓవర్ లో 16 పరుగులు చేయాల్సి ఉండగా కట్టుదిట్టమైన బౌలింగ్, ఫీల్డింగ్ మధ్య పది పరుగులు మాత్రమే చేసింది భారత్.
భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ గ్రౌండ్ లోనే భావోద్వేగానికి లోనయ్యింది.ఎప్పుడైతే హర్మన్ ప్రీత్ రన్ అవుట్ అయిందో అప్పుడే మ్యాచ్ మలుపు తిరిగింది.ఒకపక్క అనారోగ్యం ఉన్నా కూడా ఆటలో మాత్రం అద్భుత ప్రదర్శన కనపరిచింది.
ఇక 34 బంతుల్లో ఒక సిక్స్, 4 ఫోర్ల తో 52 పరుగులు చేసింది.చివరకు రన్ అవుట్ కావడంతో కన్నీరు పెట్టుకుంటూ గ్రౌండ్ నుండి బయటకు వచ్చింది.తన కన్నీరును ఎవరు చూడకుండా కళ్లద్దాలతో కవర్ చేసుకుంది.ఇక భారత మాజీ క్రికెటర్ అంజుమ్ చోప్రా, కౌర్ ను దగ్గరకు తీసుకొని ఓదార్చి, ధైర్యం చెప్పారు.
కళ్లద్దాలు ఎందుకు పెట్టుకున్నారని ప్రజెంటేటర్ వేసిన ప్రశ్నకు హర్మన్ ప్రీత్ కౌర్ ”నేను ఏడుస్తుంటే నా దేశం చూడడం” ఇష్టం లేక కళ్లద్దాలు పెట్టుకున్నానని సమాధానం ఇచ్చారు.మరోసారి దేశాన్నినిరాశపర్చబోమని నేను మాట ఇస్తున్నాను, కచ్చితంగా మెరుగవుతాం అని సమాధానం చెప్పడంతో దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.