నందమూరి వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తారకరత్న ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించి సందడి చేశారు అయితే ఇండస్ట్రీలో పెద్దగా సక్సెస్ సాధించలేకపోయారు.ఇలా ఇండస్ట్రీలో కొనసాగిన ఈయన రాజకీయాలపై కూడా ఆసక్తి కనబడుస్తూ రాజకీయాలలోకి వచ్చారు.
అయితే లోకేష్ పాదయాత్రలో భాగంగా ఆయనకు మద్దతు తెలుపుతూ పాదయాత్రలో పాల్గొన్న మొదటి రోజే ఈయన గుండెపోటుకు గురై అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయారు అనంతరం ఈయనకు మెరుగైన చికిత్స నిమిత్తం బెంగుళూరు తరలించి 23 రోజులపాటు వెంటిలేటర్ పై చికిత్స అందించిన ప్రయోజనం లేకుండా పోయింది.
ఈ విధంగా తారకరత్న మరణించడంతో ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే తారకరత్న ఇండస్ట్రీలోకి రావడం వెనుక పెద్ద కుట్ర జరిగిందని అప్పట్లో వార్తలు హల్చల్ చేశాయి.నందమూరి కుటుంబ సభ్యులే తారకరత్నను ఇండస్ట్రీలోకి తీసుకువచ్చి ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న ఎన్టీఆర్ ను తొక్కేయడానికి పెద్ద ఎత్తున కుట్ర చేశారని వార్తలు వినిపించాయి.
ఇలా ఎన్టీఆర్ ను నందమూరి వారసుడిగా యాక్సెప్ట్ చేయలేని నందమూరి ఫ్యామిలీ ఆయనను ఇండస్ట్రీలో లేకుండా చేయడం కోసం ఏకంగా ఒకేసారి తారకరత్నకు తొమ్మిది సినిమా అవకాశాలను వచ్చేలా చేశారనే వాదన కూడా వినపడింది.
ఇండస్ట్రీలో ఎన్టీఆర్ నుఎదగకుండా ఆయనని తొక్కేయాలన్న ఉద్దేశంతోనే తారకరత్నను రంగంలోకి దింపారన్న వార్తలు వైరల్ అయ్యాయి.అయితే గత కొద్ది రోజుల క్రితం ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి తారకరత్న ఈ విషయం గురించి మాట్లాడుతూ… తాను ఎన్టీఆర్ ను ఇండస్ట్రీలో ఎదగకుండా చేయడం కోసమే ఇండస్ట్రీలో అడుగు పెట్టానని వచ్చే వార్తలలో ఏ మాత్రం నిజం లేదని తెలిపారు.నేను ఇండస్ట్రీలోకి రాకముందే ఎన్టీఆర్ ఆది వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో స్టార్ హీరోగా మారిపోయారు.
తారక్ నాకు ఎప్పటికీ తమ్ముడే మా కుటుంబంలోని ఓ వ్యక్తి ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదుగుతూ నందమూరి వంశాన్ని, తాత పేరును ముందుకు తీసుకువెళ్లడం తనకు చాలా సంతోషంగా ఉందని ఇలా ఎన్టీఆర్ ఇండస్ట్రీలో ఎదగడం చూస్తుంటే తనకు చాలా గర్వకారణంగా ఉందని, తన గురించి గతంలో వచ్చిన వార్తలన్నింటినీ తారకరత్న కొట్టిపారేశారు.