దక్షిణ కాశీగా పేరు ఉన్న శ్రీ ముఖలింగేశ్వర పుణ్యక్షేత్రం అభివృద్ధికి నోచుకోక శతాబ్దాల నాటి చరిత్ర శిథిలావస్థకు చేరుకుంది.దేవాలయ నిర్వహణ పై అధికారులు నిర్లక్ష్యం చూపడంతో శిల్ప సంపద శిథిలమైపోతుంది.
వందల సంవత్సరాల పురాతన శాసనాలు కింద పడిపోవడంతో అధికారుల తీరు పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కాశీలో లింగం, గంగలో స్నానం శ్రీముఖ లింగం దర్శనం చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం.
అంతటి ప్రసిద్ధ సేవ క్షేత్రాలలో శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం శ్రీముఖలింగంలో వెలిసిన శ్రీముఖలింగేశ్వర స్వామి దేవాలయం ఒకటి.ఎంతో అపురూప శిల్ప సౌందర్యం గల ఈ దేవాలయాన్ని అధికారులు పట్టించుకోవడం లేదంటూ అర్చకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎంతో గొప్ప చరిత్ర ఉన్న ఈ పుణ్యక్షేత్రాన్ని ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది దర్శించుకుంటూ ఉంటారు.శ్రీముఖలింగం లో శిల్ప సౌందర్యం పర్యాటకులకు అబ్బురపరుస్తుంది.
చెక్కపై చెక్క లేని చిత్రాలను సైతం రాతి పై అద్భుతంగా చిత్రించిన చిత్ర కళా సౌందర్యం శ్రీముఖలింగేశ్వర దేవాలయ వైభవాన్ని తెలియజేసింది.
సంవత్సరాలు గడుస్తున్న కొద్ది దేవాలయా నిర్వహణ లోపం కారణంగా గోడలు పెంచులు ఊడుతున్నాయి.విగ్రహాల మొహం, చేతులు కాళ్లకు పగలు ఏర్పడి కిందపడి గుర్తించలేని విధంగా తయారవుతున్నాయి.సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి భోజన సదుపాయం, సత్రం, మరుగుదొడ్లు, స్నానపు గదులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దేవాలయాన్ని అభివృద్ధి చేసేందుకు పురావస్తు శాఖ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఉన్న శిల్ప సంపద రాను రానూ శిధిలావస్థకు చేరుకుంటుంది.
అలాగే గర్భగుడిలో వర్షం వచ్చినప్పుడల్లా నీళ్లు కారుతున్నాయి.దాన్ని కూడా నివారించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరుతున్నారు.
DEVOTIONAL