తిరుమల కొండపై గోవింద నామస్మరణం చేయనివ్వడం: కరాటే కళ్యాణి

తెలుగు చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి కరాటే కళ్యాణి ఒకరు.ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె బిగ్ బాస్ కార్యక్రమానికి కూడా వెళ్లారు.

 Letting Govinda Perform Namasmaranam On Tirumala Hill Karate Kalyani, Kalyani, T-TeluguStop.com

ఇలా నటిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న కరాటే కళ్యాణి తరచూ వివాదాలలో కూడా నిలుస్తున్న విషయం మనకు తెలిసిందే.తరచూ వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలిచే కరాటే కళ్యాణి తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం కోసం తిరుమల చేరుకున్నారు.

Telugu Big Boss, Kalyani, Govindaperm, Tirupati, Tollywood-Movie

తిరుపతి వెళ్ళినటువంటి ఈమెకు అక్కడ కొన్ని చేదు సంఘటనలు ఎదురవడంతో మీడియా సమావేశాన్ని నిర్వహించి తిరుమలలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి బయట పెట్టారు.స్వామివారి దర్శనం కోసం తిరుమలకు వెళ్తే కొండపై గోవింద నామస్మరణ చేయనివ్వడం లేదంటూ ఈమె ఆరోపణలు చేశారు.స్వామివారి కొండపై గోవింద నామస్మరణలు చేస్తూ ఉంటే అలా అరవకూడదు అంటూ కండిషన్లు పెడుతున్నారు.దేవుడిని మొర పెట్టుకోవడం కోసమే ఇక్కడికి వస్తే నా గోవింద నామస్మరణ చేయకుండా మా గొంతు నొక్కిస్తున్నారని ఈమె ఆలయ సిబ్బందిపై ఆరోపణలు చేశారు.

Telugu Big Boss, Kalyani, Govindaperm, Tirupati, Tollywood-Movie

ఇక కొండపై టిటిడి ఉద్యోగుల పెత్తనం జరుగుతుందనిఇక్కడ ఒక ఉద్యోగి కూడా తిరునామం పెట్టలేదని అలాగే సాంప్రదాయ దుస్తులను ధరించలేదని ఈమె ఆరోపణలు చేశారు.ఇలా సంస్కృతి సాంప్రదాయాలను పాటించకుండా స్వామి వారిని అవమానపరిస్తే ఊరుకునేది లేదని ఈమె తెలిపారు.అదేవిధంగా తిరుమల కొండపై ధరలు కూడా ఇష్టానుసారంగా ఉన్నాయని ఒక ఫ్యామిలీ తిరుమల కు చేరుకుంటే ఇక్కడ వాటర్ బాటిల్ కొనుక్కోవడానికి భారీగా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుందని ఈమె తెలిపారు.ఈ విధంగా తిరుమల కొండపై ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని టిటిడి చైర్మన్ ధర్మారెడ్డికి వినతి పత్రం అందజేశామనీ కరాటే కళ్యాణి ఈ సందర్భంగా తిరుమల కొండపై ఉన్న సమస్యలను గురించి తెలియజేస్తూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube