తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.భాకరాపేట ఘాట్ రోడ్డులో ఓ బైకును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.అదేవిధంగా మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.