అలా చేయకపోతే రిటైర్మెంట్ తీసుకుని ఇంట్లో కూర్చోవాలి... చిరు సెన్సేషనల్ కామెంట్స్!

టాలివుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి ప్రస్థానం గురించి తెలియని వారంటూ ఉండరు.ఎవరి అండ లేకపోయినా కూడా స్టార్ హీరో గా ఎదిగి మెగా సామ్రాజ్యాన్ని స్థాపించి ఇండస్ట్రీలో అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.

ఇప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ యువ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. గాడ్ ఫాదర్ సినిమా ద్వారా హిట్ అందుకున్న చిరంజీవి ఇప్పుడు వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి రానున్నాడు.

బాబీ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి పండుగ జనవరి 13వ తేదీన విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.ఈ క్రమంలో ఇటీవల హైదరాబాదులో ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ ప్రెస్ మీట్ లో చిరంజీవి మాట్లాడుతూ సినిమా గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.ఈ సినిమా ఒక ఫుల్ మీల్స్ లాంటిదని అందరికీ ఈ సినిమా తప్పకుండా నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఇక ఈ సందర్భంగా రిటైర్మెంట్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు.ఈ ప్రెస్ మీట్ లో భాగంగా ఒక విలేఖరి మాట్లాడుతూ.కెరీర్ ప్రారంభంలో గుర్తింపు కోసం కష్టతరమైన సన్నివేశాలు చేశారు.ఇప్పుడు మెగాస్టార్‌గా ఉన్నా కూడా ఈ మూవీ కోసం -8 డిగ్రీల్లో షూటింగ్ చేయాల్సిన అవసరం ఉందా? వర్షంలో తడస్తూ సీన్స్ చేయాలా?” అని చిరంజీవిని ప్రశ్నించాడు.దీంతో చిరంజీవి సమధానం చెబుతూ.చాలా అవసరం ఉంది… ఇలా చేయని రోజున రిటైర్మెంట్ ప్రకటించటం మంచిది అని అన్నారు.

Telugu Chiranjeevi, Godfather, Tollywood-Movie

చిరు మాట్లాడుతూ.ఈ మాట ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరికీ చెప్తాను… పరిస్థితులు ఎలా ఉన్నా, మనం కమిట్ అయినప్పుడు.ఆ పాత్రకి న్యాయం చేయటనికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని కనపడకుండా.వాటికి తలొగ్గి చేయాల్సిందే.అలా చేసినప్పుడే ఈ ఫీల్డ్‌లో ఉండేందుకు ఎవరికైనా అర్హత ఉంటుంది.లేదంటే ఇంటికెళ్లిపోవచ్చు.

ఒక యాక్టర్‌గా నేను ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఇలాంటి ప్రశ్నని మీతో వేయించుకోను.వేషాలపై ఆకలితో ఉండాలి.

ఒకవేళ ఆ ఆకలి చచ్చిపోయినప్పుడు ఇండస్ట్రీని వదిలేసి వెళ్లిపోవచ్చు.స్టార్ డమ్ రావాలంటే ఇలా రిస్క్ చేయటం తప్పదు.

మనం ఒక పని చేయాలని నిర్ణయించుకున్నా ఆ పనిలో వచ్చే ఇబ్బందులు అన్ని ఎదురుకోవాలి…లేదా రిటైర్మెంట్ తీసుకోవాలి అంటూ చెప్పుకొచ్చాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube