ఎన్టీఆర్ పోలికలు ఉండటం కైకాలకు కలిసొచ్చిందా.. అలా సక్సెస్ అయ్యారా?

కైకాల సత్యనారాయణ ఈరోజు ఉదయం 4 గంటల సమయంలో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.విలనిజంతో ప్రేక్షకులను భయపెట్టినా యముడి పాత్రలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించినా ఆ ప్రతిభ కైకాలకు మాత్రమే సొంతమని చెప్పవచ్చు.ఇంటర్ చదివే సమయంలో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి నటుడిగా సక్సెస్ కావాలని కైకాల సత్యనారాయణ అనుకున్నారు.777 సినిమాలలో నటించి కైకాల అరుదైన రికార్డ్ ను తన ఖాతాలో వేసుకున్నారు.

 Ntr Similarities Plus Point For Kaikala Satyanarayana Details Here , Kaikala S-TeluguStop.com

సీనియర్ ఎన్టీఆర్ కు దగ్గరి పోలికలు ఉండటం ఆయనకు ఎంతగానో కలిసొచ్చింది.సీనియర్ ఎన్టీఆర్ కు అప్పటికే స్టార్ హీరోగా గుర్తింపు ఉండటంతో ఎన్టీఆర్ కు డూప్ అవసరమైతే ఆ సన్నివేశాలలో సత్యనారాయణ నటించి మెప్పించేవారు.

ఇండస్ట్రీ పెద్దలు సత్యనారాయణను ఎన్టీఆర్ కు నకలు అని భావించేవారు.పౌరాణికాలలో ఘటోత్కచుడు, యముడు, దుర్యోధనుడు, రావణుని పాత్రల్లో నటించి కైకాల మెప్పించారు.

టీడీపీ తరపున మచిలీపట్నం లోక్ సభకు సత్యనారాయణ ఎన్నికయ్యారు.సీనియర్ ఎన్టీఆర్ తో యాక్షన్ సన్నివేశాలలో పోటాపోటీగా నటించడం సత్యనారాయణ కెరీర్ కు ప్లస్ అయింది.50 సంవత్సరాల పాటు నటుడిగా విజయవంతంగా కైకాల సత్యనారాయణ కెరీర్ ను కొనసాగించడం గమనార్హం.కైకాల గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారని సమాచారం.

వయస్సు సంబంధిత సమస్యల వల్లే ఆయన మృతి చెందారని తెలుస్తోంది.కైకాల భార్య పేరు నాగేశ్వరమ్మ కాగా ఈ దంపతులకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.ఎంతోమంది నటులకు కైకాల సత్యనారాయణ తన వంతు సహాయం చేశారు.తన సినీ కెరీర్ లో వివాదాలకు దూరంగా ఉన్న అతికొద్ది మంది నటులలో కైకాల సత్యనారాయణ ఉన్నారు.

ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ ఎక్కువ మొత్తం డిమాండ్ చేసే అవకాశం ఉన్నా పరిమితంగా రెమ్యునరేషన్ తీసుకునేవారని సమాచారం అందుతోంది.

Veteran Actor Kaikala Satyanarayana NTR Bonding

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube