ప్రపంచవ్యాప్తంగా భూమి మీద అలాగే నీటిలో ఎన్నో పురాతనమైన ఆలయాలు ఉన్నాయి.ఈ సనాతన ధర్మాన్ని పాటించేవారు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలు ఉన్నారు.
కొన్ని దేశాలలో హిందువులు ఉండటమే ఇందుకు ముఖ్య కారణం.సనాతన ధర్మం ప్రపంచంలో చాలా ప్రాచీనమైన ధర్మమని చాలామంది హిందువులు చెబుతూ ఉంటారు.
అత్యంత ధనిక దేశాలలో ఉన్న అమెరికాలో పది అద్భుతమైన ఆలయాలు ఉన్నాయి.దేవాలయాల జాబితాలో ఇంకొక హనుమాన్ దేవాలయం చేరింది.కొన్ని రోజుల క్రితం స్థాపించిన అతిపెద్ద హనుమాన్ విగ్రహం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ప్రపంచంలోనే శక్తివంతమైన దేశం అమెరికా.
అమెరికాలో చదువుకోవాలని, ఉద్యోగం చేయాలని చాలా దేశాల ప్రజలు కలలు కంటున్నారు.అలాగే ప్రతి దేశం నుంచి సంవత్సరానికి దాదాపు 5 లక్షల మంది అమెరికాకు వెళుతున్నారు.అమెరికా జనాభా 29 కోట్లు.2019 నుంచి అమెరికాలో నివసించే హిందూ జనాభా దాదాపు 32 లక్షలకు పెరిగింది.
వీరిలో అత్యధికులు భారతీయులే అయి ఉండడం విశేషం.ప్రస్తుతం అమెరికాలో హిందూ జనాభా 40 లక్షలకు పైనే ఉన్నారు.అమెరికా పౌరులు కూడా హిందూ ధర్మాన్ని ఎక్కువగా నమ్ముతున్నారు.అందుకే 2020లో అమెరికాలోని డియిలైట్ రాష్ట్రంలో 25 అడుగుల హనుమంతుని విగ్రహాన్ని అక్కడి ప్రజలు ప్రతిష్టించారు.
ఈ విగ్రహం బరువు 30 వేల కిలోలు ఈ విగ్రహాన్ని భారతదేశంలోనే తయారు చేయడం జరిగింది.ఈ విగ్రహం ఖరీదు దాదాపు 80 లక్షలు.
విగ్రహానికి పది రోజులపాటు పూజలు యాగాలు చేసిన తర్వాత డియిలైట్ రాష్ట్రంలో ప్రతిష్టించారు.అమెరికాలో ఉన్న ఎత్తైన విగ్రహాలలో ఈ విగ్రహం కూడా ఒకటి.25 అడుగుల ఎత్తు 30 టన్నుల బరువు ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అమెరికాలో ప్రతిష్టించి హిందూ సంప్రదాయాన్ని అగ్రరాజ్యానికి పరిచయం చేశారు.ఈ విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ కు చెందిన రాజు తన 12 మంది వర్కర్లతో కలిసి ఈ విగ్రహాన్ని ఆరు నెలల పాటు కష్టపడి తయారు చేసినట్లు తెలిపారు.
DEVOTIONAL