,Kobe beef croquettes : ఆర్డర్ చేసిన 32 ఏళ్ల తర్వాత ఫుడ్ డెలివరీ.. అయినా పెరుగుతున్న ఆర్డర్లు..

సాధారణంగా మనం ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ పెడితే ఒక అర్థగంట నుంచి గంటలోపు ఇంటి వద్దకు ఫుడ్ వచ్చేస్తుంది.అయితే ఒక ఫుడ్ మాత్రం ఆర్డర్ చేసిన 32 ఏళ్ల తర్వాత హోమ్ డెలివరీ అవుతుంది.32 ఏళ్ల తర్వాత తినే తిండి కోసం ఇప్పుడు ఆర్డర్ పెట్టడం ఏంటి? అసలు ఆ సమయం వరకు ఉంటారో, గాల్లో కలిసి పోతారో కూడా తెలియదు.ఒక పది నిమిషాలు డెలివరీ ఆలస్యమైపోతేనే చిర్రెత్తుకొచ్చే ప్రజలు కూడా ఉన్నారు.

 Food Delivery After 32 Years Of Ordering But Orders Are Increasing , Kobe Beef-TeluguStop.com

అలాంటిది ఒక్క ఫుడ్ కోసం ఎవరైనా 32 ఏళ్లు ఆగుతారా అనే అనుమానం మీకు కలగక మానదు.కానీ ఆ ఫుడ్ రుచి చాలా బాగుంటుంది.ఆ రుచిని ఆస్వాదించడానికి 32 ఏళ్లు వేచి ఉన్నా తప్పేం లేదట.

అందుకే క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఫుడ్ ఆర్డర్ చేసి 32 ఏళ్ల తర్వాత ఆహారం తినడానికి అందరూ రెడీ అవుతున్నారు.

జపాన్‌లోని టకసాగో నగరంలోని అసహయా రెస్టారెంట్‌లో ఈ ఫుడ్ ఆర్డర్ తయారుచేస్తారు.ఆ ఫుడ్ పేరు కోబ్ బీఫ్ క్రొకేట్స్.దీనికి ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది.కాగా 2013లో ఒక మహిళ ఫుడ్ ఆర్డర్ చేయగా ఆమెకు కోబ్ బీఫ్ ఈ ఏడాది ఏప్రిల్‌లో డెలివరీ అయిందట.

అంటే ఆమె ఈ ఫుడ్ కోసం ఏకంగా 9 ఏళ్లు వెయిట్ చేసింది.

Telugu Long Period, Japan, Kobebeef-Latest News - Telugu

కోబ్ అనే ఈ గొడ్డు మాంసం క్రోకెట్లను అసహయా రెస్టారెంట్ చాలాకాలంగా అమ్ముతోంది.1926న ప్రారంభమైన ఈ రెస్టారెంట్ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మెనూలో కోబ్ బీఫ్ క్రోక్వెట్లు యాడ్ చేసింది.అప్పటినుంచి వీటికి డిమాండ్ పెరిగిపోయింది.

కాగా 2000ల ప్రారంభం వరకు ఈ డీప్-ఫ్రైడ్ బంగాళాదుంపలు, గొడ్డు మాంసం కుడుములు ఆన్‌లైన్‌లో మరింత ప్రజాదారణ పొందాయి.అయితే 2016 తర్వాత వీటిని తయారు చేయడం రెస్టారెంట్ యాజమాన్యం ఆపేసింది.

కానీ ఆర్డర్లు ఆగకుండా వస్తూనే ఉన్నాయి.దీంతో వీరు దీనిని తయారు చేయక తప్పడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube