Mahesh Babu Balakrishna : బాలయ్య మాటలకు మహేష్ ఎందుకు నవ్వాడో తెలుసా.. అందుకు గౌతమ్ నే కారణమా?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.సినీ దిగ్గజం సూపర్ స్టార్ కృష్ణ మరణించడంతో టాలీవుడ్ లో విషాదఛాయలు అలుముకున్నాయి.

 Reason Behind The Smiles Of Mahesh & Balayya In Viral Pic, Super Star Krishna, M-TeluguStop.com

ఇక తండ్రి మరణంతో మహేష్ బాబు కూడా తీవ్ర దుఃఖంలో మునిగి పోయారు.కృష్ణ గుండె పోటు కారణంతో మరణించారు.

ఈయన మరణంతో కుటుంబం మొత్తం దుఃఖ సాగరంలో ఉన్నారు.

ఎప్పుడు ముఖం మీద చిరునవ్వు మాత్రమే ఉండే మహేష్ బాబు తండ్రి మరణంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.

మహేష్ కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యం చుసిన ఫ్యాన్స్ కు కూడా దుఃఖం ఆగలేదు.ఒకే ఏడాది కుటుంబంలో ముగ్గురిని పోగొట్టుకుని మహేష్ పూర్తి షాక్ లోకి వెళ్ళిపోయాడు.

అయితే అంత బాధలోనే మహేష్ ను బాలయ్య నవ్వించారు.

ఇందుకు కారణం ఏంటో తెలియక పోయిన మహేష్ ను నవ్వించడంతో బాలయ్యను అంతా మెచ్చుకున్నారు.

కృష్ణకు నివాళులు అర్పించిన తర్వాత బాలయ్య కొద్దిసేపు మహేష్ తో ముచ్చటించారు.ఆ సమయంలో మహేష్ తో పాటు ఆయన తనయుడు గౌతమ్ కృష్ణ, గల్లా జయదేవ్ కూడా ఉన్నారు.

ఆ సమయంలో అసలు మహేష్ నవ్వడానికి కారణం ఏంటో ఇప్పుడు బయటకు వచ్చింది.

Telugu Galla Jayadev, Gautam Krishna, Mahesh Babu, Smilesmahesh, Krishna-Movie

బాలయ్య మహేష్ పక్కనే ఉన్న గౌతమ్ ను చూసి మీ వాడు పెద్దోడు అయ్యాడు.హీరోగా పరిచయం చేయవచ్చు అన్నట్టుగా అన్నారట.అప్పుడు గౌతమ్ తో పాటు మహేష్ కూడా నవ్వడం జరిగింది.

ఇలాంటి కష్టసమయంలో జోకులు వేస్తె విమర్శలు చేస్తారు.కానీ మహేష్ ను నవ్వించిన బాలయ్యకు మాత్రం సూపర్ స్టార్ ఫ్యాన్స్ కృతజ్ఞతలు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube