ఢిల్లీలో దారుణంగా హత్యకు గురైన శ్రద్ధ కేసులో దారుణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు శ్రద్ధ ముఖాన్ని నిందితుడు ఆఫ్తాబ్ కాల్చి వేసినట్లు పోలీసులు విచారణలో వెల్లడైందని తెలిపారు.
హత్య అనంతరం శ్రద్ధ మృతదేహాన్ని సుమారు 20 వేల లీటర్ల నీటితో కడిగినట్లు గుర్తించారు.అయితే శ్రద్ధ హత్య జరిగిన కొన్ని రోజులకు తూర్పు ఢిల్లీలో పోలీసులకు తెగిపడిన తల భాగం లభ్యమైంది.
ఈ నేపథ్యంలో తల శ్రద్ధదేనా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఈ మేరకు హత్యకు గురైన యువతి తండ్రి నుంచి డీఎన్ఏ శాంపిల్స్ ను సేకరించారు.
ముందుగా శ్రద్ధ గొంతునులిమి హత్య చేసిన ఆఫ్తాబ్ ఆమె మృతదేహాన్ని 20 వేల లీటర్లతో కడిగాడు.మృతురాలి శరీరభాగాలను 18 ప్లాస్టిక్ బ్యాగుల్లో తీసుకెళ్లి సమీప అటవీ ప్రాంతంలో పడేశాడు.
అనంతరం వాక్యూమ్ క్లీనర్ తో ఇళ్లంతా శుభ్రం చేశాడు.హత్యకు ముందు శ్రద్ధకు, ఆఫ్తాబ్ కు గొడవ జరిగినట్లు విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు.
నిందితుడు ఆఫ్తాబ్ ను భద్రతా కారణాలతో మెహ్రోలీ పోలీస్ స్టేషన్ నుంచి తరలించారు.ఈ క్రమంలో సాకేత్ కోర్టులో హాజరుపరచనున్నారు.
నిందితుడిని మరికొన్ని రోజులు కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరనున్నారని తెలుస్తోంది.ఇప్పటికే నిందితుడు ఇచ్చిన ఆధారాలతో అడవుల్లో 13 అవశేషాలను పోలీసులు గుర్తించారు.
అదేవిధంగా కిచెన్ లో శ్రద్ధ రక్తపు మరకలను పోలీసులు గుర్తించారు.హత్యకు వినియోగించిన కత్తి దొరికితే నిందితుడు ఆఫ్తాబ్ మెడకు ఉరి బిగిసినట్లేనని భావిస్తున్నారు.