అందరి పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉంటాయి అనుకోవటం పొరపాటు.ఎందుకంటే ఒకసారి మంచి హోదాలో ఉన్న మరోసారి పేదరికంలో బ్రతకాల్సి వస్తుంది.
ఎప్పుడు పేదవారిగా ఉంటామో, ఎప్పుడు ధనవంతులుగా మారుతామో ఎవరికి తెలియదు.ఒకప్పుడు ఎంతో ధనవంతులై ఉన్నా కూడా ఇప్పుడు పేదరికం అనుభవించాల్సి వస్తుంది.
అదే ఒకప్పుడు పేద వారిగా బతికిన వాళ్ళు ఇప్పుడు ధనవంతులుగా బతుకుతున్నారు.ఇలాంటివి మన కళ్ల ముందు చాలా చూస్తూనే ఉన్నాము.
అయితే ఇవి సామాన్యులకే కాదు సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులకు కూడా ఎదురవుతుంటాయి.సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు కూడా ఎప్పుడు ఒకేలా ఉండరు.చాలావరకు వారి జీవితం మంచిగా ఉంటుందని అందరూ అనుకుంటారు.కానీ ఎప్పుడు పరిస్థితులు మారుతాయో ఎవరికీ తెలియదు.
ఇప్పటికే చాలామంది ఇండస్ట్రీకి చెందిన నటీనటులు ఒకప్పుడు ఎలా బతికామో.ఇప్పుడు ఎలా బతుకుతున్నామో అని చెప్పుకునే పరిస్థితులు కూడా వచ్చాయి.
ఎందుకంటే వారి దగ్గర డబ్బు శాశ్వతంగా ఉంటుంది అని అనుకోవటం పొరపాటు.మధ్యలో వచ్చే నష్టాల వల్ల వాళ్ళ పరిస్థితులు ఎక్కడికి దిగజారుతాయో కూడా ఊహించుకోము.అయితే అటువంటి పరిస్థితే ఒకప్పటి స్టార్ హీరోల వారసులకు ఎదురైంది.ఇంతకు ఆ స్టార్ హీరో ఎవరు.
ఆయన వారసులకు ఏమయ్యింది.వాళ్ళు ఎలా ఉన్నారు అనే విషయాలు తెలుసుకుందాం.
తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన అలనాటి హీరో కాంతారావు. ఈయన గురించి ఈ తరం ప్రేక్షకులకు పరిచయం ఉండదు కానీ ముందు తరాల ప్రేక్షకులకు మాత్రం ఈయన గురించి బాగా పరిచయం.నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కాంతారావు వందల సినిమాలలో నటించి స్టార్ హీరో హోదాకు ఎదిగాడు.అంతేకాకుండా ఇండస్ట్రీలో ఉన్నంతకాలం ఎంతో గౌరవంగా బ్రతికాడు.
పైగా ఎన్నో ఆస్తులను కూడా సంపాదించాడు.కానీ ఇప్పుడు ఆయన కొడుకుల పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది.
ఆ కొడుకులు తమకు సహాయం కావాలి అంటూ కోరుతున్నారు.ఇటీవలే హైదరాబాదులో రవీంద్ర భారతిలో కాంతారావు శతజయంతి ఉత్సవాలు జరగగా ఆ వేడుకకు కాంతారావు కొడుకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన కొడుకులు తమ దీన పరిస్థితి గురించి తెలిపారు.సినీ పరిశ్రమ అంటే నాన్నకు ఎంతో ఇష్టం అంటూ.ఆస్తులు అమ్ముకొని మరి సినిమాలు తీశాడు అని. దానివల్ల తాము ఆర్థికంగా చాలా నష్టపోయాము అంటూ వాపోయారు.తన తండ్రి క్యాన్సర్ బారిన పడినప్పుడు కూడా చికిత్స కోసం చాలా డబ్బులు ఖర్చు చేసాం అంటూ.ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తూ కుటుంబాలను పోషిస్తున్నామని అన్నారు.
అంతేకాకుండా ఒకప్పుడు మద్రాస్ లో బంగ్లాలో ఉన్న తాము.ఇప్పుడు సిటీకి దూరంగా ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాము అంటూ.
సినీ పరిశ్రమ నుంచి తమకు ఎటువంటి సహాయం అందలేదు అని.అందుకు తెలంగాణ ప్రభుత్వాన్ని తమకు ఇల్లు కేటాయించి సహాయం చేసి ఆదుకోవాలి అంటూ తెలిపారు.మరి వీరి పరిస్థితి గురించి తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.