Most Expensive Wood : చెట్లకు సెలైన్‌లో విషం పెట్టి.. లక్షకు కిలో లెక్కన అమ్మి..

చెట్లకు సెలైన్‌ పెట్టిన ఫొటోలను చూసి చాలా మంది.అడవుల నరికివేతకు నిరసనగా చేపట్టిన కార్యక్రమమేమో అనుకున్నారు.

 Poisoning Trees To Create The World’s Most Expensive Wood,most Expensive Wood,-TeluguStop.com

కొందరైతే ఫంగస్‌ సోకిన చెట్లకు చికిత్సగా మందు పెట్టారని అన్నారు.కానీ అసలు విషయం తెలిసి చాలా మంది అవాక్కయ్యారు.

ఎందుకంటే.ఈ చెట్లకు సెలైన్‌ పెట్టింది ప్రపంచంలోనే అత్యంత విలువైన, ప్రత్యేకమైన సుగంధ కలపను తయారు చేయడానికి మరి.

ఆసియా దేశాల్లో పెరిగే అక్విలేరియా చెట్లు ఇవి.పలుచోట్ల కైనం, క్యారా అనే పేర్లతోనూ పిలుస్తారు.

నిజానికి వీటి కలప మామూలుగానే, ఎటువంటి వాసన లేకుండా ఉంటుంది.కానీ ఈ చెట్లకు ‘ఫియలోఫోరా పారాసైటికా’ అనే ఫంగస్‌ సోకినప్పుడు.

దాని నుంచి రక్షణ కోసం ప్రత్యేకమైన నల్లటి రెసిన్‌ను విడుదల చేస్తాయి.ఈ రెసిన్‌ కలిసిన కలప అత్యంత ఘాటైన సుగంధాన్ని వెదజల్లుతుంది.

పూర్వకాలం నుంచీ రాజులు, రాణులు, ఉన్నత వర్గాల వారు ఈ కలపను వినియోగించేవారు.

Telugu Agarwood, Indonesia, Iv Therapy, Kyara, Expensive Wood, Myanmar, Road Aca

నిజానికి ఈ ఫంగస్‌ చెట్లకు విషం వంటిది.దాన్ని నిరీ్వర్యం చేసేందుకే రెసిన్‌ను విడుదల చేసుకుంటాయి.దీనిని గుర్తించిన పెంపకందారులు.

సదరు ఫంగస్‌ కలిపిన ద్రావణాన్ని సెలైన్‌ బ్యాగుల్లో నింపి, ఈ చెట్ల కాండాల లోపలికి సూదులు గుచ్చి పంపించడం మొదలుపెట్టారు.దీనితో చెట్లు రెసిన్‌ విడుదల చేస్తాయి.

కాండం సుగంధ కలపగా మారుతుంది.నిజానికి ఈ ప్రక్రియకు పెద్దగా ఖర్చేమీకాదు.

కానీ ఈ చెట్లను పెంచి, సుగంధ కలపగా మార్చేవారు తక్కువగా ఉండటంతో డిమాండ్, ధర చాలా ఎక్కువ.ఇండోనే షియా, మయన్మార్, వియత్నాంతోపాటు పలు ఇతర ఆసియా దేశాల్లోనూ వీటిని పెంచుతుంటారు.

ఈ చెట్లలో మొత్తం కలప సుగంధభరితంగా మారదు.ఫంగస్‌ సోకిన భాగం, దాని చుట్టూ కొంతమేర మాత్రమే రెసిన్‌ నిండుతుంది.అందువల్ల రోజూ ఓ భాగంలో సూది గుచ్చి ఫంగస్‌ ద్రావణాన్ని సెలైన్‌లా ఎక్కిస్తుంటారు.ఇలా చాలాకాలం చేయాల్సి ఉంటుంది.

తర్వాత ఆ చెట్టును కొట్టి.కాండాన్ని చాలా జాగ్రత్తగా ముక్కలు చేస్తారు.

సుగంధ భరితంగా మారిన భాగాలను వేరు చేసి విక్రయిస్తారు.ఇలా సేకరించిన ముక్కల విలువ కిలోకు రూ.లక్షపైనే ఉంటుంది.ఇక ఈ కలప నుంచి తీసిన సుగంధ నూనె అయితే లీటరుకు సుమారు రూ.60 లక్షల వరకు పలుకుతుందట

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube