మడమ నొప్పి.మనలో చాలా మందిని తీవ్రంగా మదన పెట్టే సమస్యల్లో ఇది ఒకటి.
మడమ నొప్పి కారణంగా కొందరైతే నడవడానికి ఎంతో అసౌకర్యంగా మరియు బాధాకరంగా ఫీల్ అవుతుంటారు.ఈ క్రమంలోనే మడమ నొప్పి నుంచి బయట పడటం కోసం ముప్ప తిప్పలు పడుతుంటారు.
ఈ జాబితాలో మీరు ఉన్నారా.? అయితే డోంట్ వర్రీ.
ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాలు పాటిస్తే చాలా సులభంగా మరియు వేగంగా మడమ నొప్పి నుండి ఉపశమనాన్ని పొందొచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం మడమ నొప్పిని నివారించే ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని పది గ్లాసుల వరకు వాటర్ పోసుకోవాలి.
వాటర్ బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి టబ్ లోకి పోసుకోవాలి.
ఈ హాట్ వాటర్ లో రెండు టేబుల్ స్పూన్లు రాక్ సాల్ట్, రెండు టేబుల్ స్పూన్లు బేకింగ్ సోడా వేసి బాగా మిక్స్ చేయాలి.వాటర్ హీట్ కాస్త తగ్గిన తర్వాత పాదాలను ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు టబ్ లో ఉంచాలి.
ఇలా రోజుకు ఒకసారి చేస్తే కనుక మడమ నొప్పి నుంచి చక్కటి ఉపశమనం లభిస్తుంది.
అలాగే మడవ నొప్పితో సతమతం అవుతున్నవారు రోజుకు ఒకసారి ఐసు ముక్కలు తీసుకుని మడమలపై మసాజ్ చేసుకోవాలి.
ఈ ఐస్ థెరపీ ద్వారా కూడా మడమ నొప్పి నుంచి మంచి ఉపశమనాన్ని పొందొచ్చు.
ఇక మడమ నొప్పితో మదన పడుతున్న వారు ప్రతి రోజు కనీసం ఐదు నిమిషాల పాటు రాళ్లపై చెప్పులు తీసేసి నెమ్మదిగా నడుస్తూ ఉండాలి.ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి మడమ నొప్పి దూరం అవుతుంది.