వైసీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి కన్నుమూశారు.గత కొంతకాలంగా అనారోగ్యంతో ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు.
న్యూమోనియాతో బాధపడుతూ గత నెలలో 25న హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చేరారు.ఈ క్రమంలోనే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
కాగా చల్లా భగీరథ రెడ్డి స్వస్థలం అవుకు మండలంలోని ఉప్పలపాడు.చల్లా భగీరథ రెడ్డి పార్ధివదేహాన్ని స్వస్థలానికి తరలించనున్నారు.
ఈ నేపథ్యంలోనే రేపు అవుకులో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు.ఈ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరు అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.