హైదరాబాద్ యూసుఫ్‌గూడ చౌరస్తాలో నిన్న బీజేపీ, TRS కార్యకర్తలు ఘర్షణకు దిగారు.బీజేపీ నేతలు కేసీఆర్ దిష్టిబొమ్మను, TRS నేతలు మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ క్రమంలో కార్యకర్తల మధ్య గొడవ జరిగింది.మహిళా కార్యకర్తలు సైతం పరస్పరం దాడి చేసుకున్నారు.
బూతులు తిట్టుకున్నారు.దీంతో గంటకు పైగా ట్రాఫిక్ జామ్ అయింది.
పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు.