ప్రముఖ నటి పవిత్ర లోకేశ్ కు ప్రేక్షకుల్లో భారీ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే విషయం తెలిసిందే.ఈ మధ్య కాలంలో వరుసగా వివాదాల ద్వారా ఆమె వార్తల్లో నిలుస్తున్నారు.
నరేష్ తో పవిత్ర లోకేశ్ నాలుగో పెళ్లి అంటూ గతంలో వార్తలు వైరల్ కావడంతో అప్పటినుంచి ఆమె మీడియాకు దూరంగా ఉంటున్నారు.మీడియాతో మాట్లాడటం వల్ల వివాదాలు మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉందని ఆమె భావిస్తున్నారు.
అయితే ఒక సందర్భంలో పవిత్ర లోకేశ్ తన క్రష్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.టాలీవుడ్ మన్మథుడిగా పేరు సంపాదించుకున్న నాగార్జున తన ఫస్ట్ క్రష్ అని పవిత్ర లోకేశ్ వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆరో తరగతి, ఏడో తరగతి నుంచే స్టార్ హీరో నాగార్జునపై ఇష్టం ఏర్పడిందని పవిత్ర లోకేశ్ పేర్కొన్నారు.
గీతాంజలి సినిమా సక్సెస్ తో నాగార్జునపై నాకు ఇష్టం ఏర్పడిందని పవిత్ర లోకేశ్ వెల్లడించడం గమనార్హం.
చాలా తక్కువసార్లు మాత్రమే నాగార్జునను డైరెక్ట్ గా కలిశానని ఆమె చెప్పుకొచ్చారు.తెలుగులో వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్న పవిత్ర లోకేశ్ వ్యక్తిగత జీవితంలోని వివాదాల వల్ల ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలిచారు.
గతంతో పోల్చి చూస్తే ఆమెకు సినిమా ఆఫర్లు తగ్గాయి.
రోజుకు లక్ష రూపాయలకు అటూఇటుగా పవిత్ర లోకేశ్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.పవిత్ర లోకేశ్ కీలక పాత్రలో నటించిన అందరూ బాగుండాలి అందులో నేనుండాలి సినిమా ఈరోజు విడుదలైంది.ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడం గమనార్హం.
పవిత్ర లోకేశ్ కు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది.