ఐసిసి టి20 ర్యాంకింగ్స్ లో దూసుకుపోతున్న కింగ్ కోహ్లీ.. ఎన్నో స్థానం అంటే..

టి20 వరల్డ్ కప్ 2022 ఆస్ట్రేలియాలో మొదలై టీమిండియా మొదటి మ్యాచ్ లో పాకిస్తాన్తో అద్భుతమైన విజయాన్ని కూడా నమోదు చేసింది.ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన విరాట్ కోహ్లీ టి20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో మళ్లీ ముందుకి వస్తున్నాడు.

 King Kohli Top 10 In The Icc T20 Rankings Details, Virat Kohli, Cricketer Virat-TeluguStop.com

ఐసీసీ మెన్స్‌ ప్లేయర్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌ 10లో కోహ్లీ ఎంట్రీ ఇచ్చాడు.మన టీం ఇండియా మాజీ కెప్టెన్ కింగ్ కోహ్లీ ప్రస్తుతం తొమ్మిదవ స్థానంలో ఉన్నాడు.

పాక్‌పై అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడిన కోహ్లీ ఒక్కసారిగా ర్యాంకింగ్స్‌లో దూసుకొస్తున్నాడు.మెల్‌బోర్న్‌లో చివరి బంతి వరకు ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచ్లో కోహ్లీ అద్భుతమైన పోరాటం వల్ల టీమిండియా విజయం సాధించింది.

కింగ్ కోహ్లీ ఈ మ్యాచ్ లో అజయంగా 22 పరుగులు చేశాడు.టీమిండియా మాజీ కెప్టెన్ కింగ్ కోహ్లీ ఆడిన ఈ ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, నాలుగు భారీ సిక్సర్లు కొట్టాడు.53 బంతుల్లో 82 రన్స్‌ చేసి నాటౌట్‌గా నిలవడం విశేషం.దీంతో అతను ఐసీసీ టీ20 బ్యాటర్స్‌ ర్యాంకింగ్స్‌లో అయిదు స్థానాలు దాటుకొని ముందుకి వచ్చాడు.

ఇక బుధవారం రిలీజైన టి20 బ్యాటర్స్ ర్యాంకింగ్స్‌ లిస్టులో కోహ్లీ తొమ్మిదవ స్థానంలో నిలిచాడు.

Telugu Cricket, Cricketervirat, Devon Conway, Icc, Icc Cup, India, India Pak, Mo

పాకిస్థాన్‌ క్రికెటర్‌ మహమ్మద్‌ రిజ్వాన్‌ ప్రస్తుతం టీ20 బ్యాటర్స్‌ లిస్టులో టాప్‌ ర్యాంక్‌లో కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఇక ఆస్ట్రేలియాపై 92 రన్స్‌ చేసిన న్యూజిలాండ్‌ ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే రెండవ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.రిజ్వాన్‌ 849 రేటింగ్‌ పాయింట్లతో టాప్‌లో ఉండగా ప్రస్తుతం ఈ స్థానం కోసం చాలామంది బ్యాటర్లు పోటీపడుతున్నారు.పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌, సౌతాఫ్రికా బ్యాటర్‌ మార్‌క్రమ్‌లు కూడా t20 బ్యాటర్స్ మొదటి స్థానం కోసం పోటీ పడుతున్నారు.టి20 వరల్డ్ కప్ పూర్తయి వరకు ఈ స్థానాలు ఎలా మారిపోతాయో అనేది తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube