మూడు రాజధానులు వర్సెస్ ఏకైక రాజధాని ! సుప్రీం కోర్టు కీలక నిర్ణయం

ఏపీలో హాట్ టాపిక్ వ్యవహారం ఏదైనా ఉందా అంటే అది మూడు రాజధానులకు సంబంధించిన అంశమే.ఏపీని మూడు రాజధానులు చేసి అన్ని ప్రాంతాల్లోనూ అభివృద్ధి సమానంగా ఉండేలా చూస్తామంటూ ఏపీ అధికార పార్టీ వైసీపీ చెబుతుండగా,  ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు రాజధానుల ప్రతిపాదనను అంగీకరించేది లేదని అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలి అంటూ ఆ ప్రాంత రైతులు మహిళల తో పాటు,  టిడిపి , జనసేన,  బిజెపి వంటి పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.

 Supreme Court Key Decision On Ap Three Capitals Details, Suprem Court,ap Governm-TeluguStop.com

ఈ వ్యవహారం పైనే ఏపీలో రాజకీయ రచ్చ జరుగుతుంది.ప్రస్తుతం మహా పాదయాత్ర పేరుతో అమరావతి నుంచి అరసవల్లి వరకు అమరావతి ప్రాంతానికి చెందిన రాజధాని రైతులు యాత్రను చేపట్టారు.
  దీనికి హైకోర్టు కూడా షరతులతో కూడిన అనుమతులు ఇచ్చింది.ఇక ఈ వ్యవహారంపై ప్రాంతాల వారీగా వివాదాలు మొదలయ్యాయి.ఇక ఈ రోజు రోజుకు ఈ వ్యవహారం రాజకీయంగాను రచ్చగా మారుతుండడం తో , చివరకు మూడు రాజధానులు అంశం నెగ్గుతుందా.లేక అమరావతి రాజధానిగా కొనసాగుతుందా అనే విషయంలో అందరికీ సందేశం ఏర్పడింది.

ఇప్పటికే హైకోర్టులో ఈ వ్యవహారంపై పిటిషన్లు దాఖలయ్యాయి.అమరావతిని రాజధానిగా కొనసాగించాలని, రాజధానిని మార్చే విషయంలో ప్రస్తుతం ఏపీ ప్రభుత్వానికి అధికారం లేదంటూ హైకోర్టు చెప్పడంతో పాటు,  త్వరగానే అమరావతిలో రాజధాని నిర్మించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.
 

Telugu Amaravati, Ap, Jagan, Janasena, Kurnool, Suprem, Supreme, Vishakapatnam,

అయితే గతంలో ఏపీ రాజధానిని అమరావతిలోనే నిర్మించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఏపీ ప్రభుత్వం అమలు చేయడం లేదంటూ అమరావతి ప్రాంత రైతులు సైతం పిటిషన్ దాఖలు చేయడంతో,  ఆ పిటిషన్ వచ్చే నెల ఒకటో తేదీన విచారణకు రానుంది.అయితే దీనిపై ఏపీ ప్రభుత్వం త్వరగా తేల్చాలంటూ పిటిషన్ దాఖలు చేయడంతో , ఆ పిటిషన్ ను అమరావతి ప్రాంత రైతులు వేసిన పిటిషన్ ను కలిపి ఒకేసారి విచారించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది.దీంతో వచ్చే నెల ఒకటో తేదీన ఏపీ రాజధాని వ్యవహారంలో ఒక క్లారిటీ రాబోతోంది.

Telugu Amaravati, Ap, Jagan, Janasena, Kurnool, Suprem, Supreme, Vishakapatnam,

సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వానికి  రాజధాని నిర్మాణం విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం ఉందని తీర్పు ఇస్తే… జగన్ ప్రతిపాదించినట్లుగా అమరావతి, విశాఖ, కర్నూలు లో మూడు రాజధానులు ఏర్పాటు అవుతాయి.అదే అమరావతిలోని కొనసాగించాలంటూ సుప్రీం కనుక తీర్పునిస్తే,  ఏపీ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లే.ఇప్పటికే ఈ వ్యవహారంపై వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు ఏకమై ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తూ.అనేక ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాయి.ఇప్పుడు సుప్రీం లో అమరావతి ప్రాంత రైతులకు అనుకూలంగా తీర్పు వస్తే రాజకీయంగాను వైసిపి అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.ఈ విషయంలో ఏం జరగబోతోంది అనేది సుప్రీంకోర్టు విచారణ తర్వాత ఒక క్లారిటీ రాబోతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube