ఎన్‌కౌంటర్‌కు గురైన గ్యాంగ్‌స్టర్ నయీం ప్రధాన అనుచరుడు శేషన్నను పోలీసులు విచారిస్తున్నారు.మూడు నెలల క్రితం హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్లో శేషన్నపై కేసు నమోదైంది.
పిస్టల్‌తో అబ్దుల్లా బెదిరించినట్లు బాధితుడు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.అబ్దుల్లాకు శేషన్న పిస్టల్ ఇచ్చినట్లు పోలీసులు తేల్చారు.
పక్కా సమాచారంతో శేషన్నను కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్, టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అయితే, శేషన్నను రహస్య ప్రాంతంలో ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.
నయీం ఎన్కౌంటర్ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన శేషన్న.ఏడాది కాలంగా పలువురిని బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలోనే మైలార్‌దేవ్‌పల్లి, హుమయూన్ నగర్, గోల్కొండ పీఎస్‌లలో శేషన్నపై కేసులు నమోదు అయ్యాయి.