మరో పాతిక సంవత్సరాలు జగనే సీఎం అంటున్న మంత్రి..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్నాయి. ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరును వైఎస్ఆర్ యూనివర్సిటీ పేరుగా మార్చడానికి ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడంతో టిడిపి పార్టీ నేతలు ఆందోళనలు చేశారు.

 Minister Jogi Ramesh Sensational Comments On Cm Jagan, Minister Jogi Ramesh,ntr-TeluguStop.com

ఈ క్రమంలో అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు అధికారంలో ఉన్నంతకాలం ఎన్టీఆర్ పేరు గుర్తుకు రాలేదని అన్నారు.

అధికారంలో లేనప్పుడు మాత్రమే చంద్రబాబుకి ఎన్టీఆర్ పేరు గుర్తొస్తుందని ఎద్దేవా చేశారు.అసెంబ్లీలో గొడవలు సృష్టించడానికి రోజు టీడీపీ నేతలు ఏదో ఒక అంశాన్ని ఎంచుకుంటున్నారని మండిపడ్డారు.

Telugu Assembly, Chandrababu, Cm Jagan, Jogi Ramesh, Jogiramesh, Ntr, Ysr-Politi

చంద్రబాబు కంటే సీఎం జగన్ కి ఎన్టీఆర్ పై నిజమైన ప్రేమ ఉంది.అందువల్లే జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతానని ముందుగానే హామీ ఇచ్చి.అధికారంలోకి వచ్చి మాట నిలబెట్టుకున్నారు.చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో ఎన్టీఆర్ కి భారతరత్న కోసం ఏం చేశారు అని ప్రశ్నించారు.ఇక లోకేష్ పాదయాత్ర వార్తలపై కూడా సెటైర్లు వేశారు.రాష్ట్రంలో పేదల జీవితాలలో వైద్య రంగానికి సంబంధించి వైఎస్ తీసుకున్న గొప్ప నిర్ణయాలు.

కారణంగానే.హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ పేరు పెట్టాలని బిల్లు తీసుకొస్తున్నట్లు స్పష్టం చేశారు.

అంతేకాదు మరో పాతిక సంవత్సరాలు జగనే ముఖ్యమంత్రి అని మంత్రి జోగి రమేష్ అన్నారు.దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్క బటన్ నొక్కి ప్రజల ఖాతాల్లోకి.₹1,70,000కోట్లు జమ చేయలేదని తెలిపారు.అమ్మ ఒడి, విద్యా దీవెన, చేయూత, విద్యా కానుక, రైతు భరోసా లాంటి 30 సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయి అని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube