తెలుగు రాష్ట్రాల్లో క్యాసినో కేసు సంచలనం సృష్టించింది.ఈ వ్యవహరంలో చికోటి ప్రవీణ్ ను ఈడీ అధికారులు విచారిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే, తాజాగా చికోటి ప్రవీణ్ హైకోర్టును ఆశ్రయించారు.తనకు రక్షణ కల్పించాలని కోరుతూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
ప్రాణహాని ఉందని, 2 + 2 గన్ మెన్ లను ఏర్పాటు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు.
మరోవైపు, చికోటి ప్రవీణ్ ఇంటి ముందు అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నట్లు అనుచరులు గుర్తించారు.
ఈ విషయంపై చికోటి న్యాయవాది సైదాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.చికోటి ప్రవీణ్ ను చంపించేందుకు తెర వెనుక కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని కుటుంబసభ్యులు, అనుచరులు ఆరోపిస్తున్నారు.
ఈ క్రమంలో చికోటి ప్రవీణ్ రక్షణ కల్పించాలని కోరుతున్నారు.