సినిమాలను సైతం తలదన్నేలా ప్రేయసికి ప్రపోజ్

అనేక లవ్ ప్రపోజల్ వీడియోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో చక్కర్లు కొడుతున్నాయి.వాటిలో ప్రతి ఒక్కటి చాలా భావోద్వేగాలను కలిగి ఉంటాయి.

 Man Proposes To Girl Friend When She Reaches To Finish Line In Buffalo Marathon-TeluguStop.com

కాబట్టి నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తుంటాయి.ఇటీవల ఒక వ్యక్తి తన ప్రేయసికి ప్రపోజ్ చేయడానికి అసాధారణమైన మార్గాన్ని ఎంచుకున్నాడు.

అతడు ప్రపోజ్ చేసిన తీరు అందరినీ ఎంతో ఆకర్షించింది.ఆ మధురమైన క్షణాలను కొందరు కెమెరాలో బంధించారు.

సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే విపరీతమైన స్పందన లభిస్తోంది.ఇలా ప్రపోజ్ చేస్తే ఒప్పుకోకుండా ఎలా ఉంటారంటూ కామెంట్లు చేస్తున్నారు.

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

ఇటీవల అమెరికాలో బఫెలో మారథాన్ నిర్వహించారు.

అందులో మాడిసన్ అనే యువతి కూడా పాల్గొంది.ఆమె చాలా వేగంగా పరుగెత్తుకుంటూ తన మారథాన్‌ను ముగించింది.

అయితే ఫినిష్ లైన్ వద్దకు వచ్చేటప్పటికే ఆమె ప్రియుడు అక్కడ వేచి ఉన్నాడు.అతడి పేరు క్రిస్టోఫర్.

అతడు తన చేతిలో ఓ ఉంగరాన్ని పట్టుకుని మోకాళ్లపై నిల్చుని ఉన్నాడు.అయితే అతడి తీరుకు ఒక్కసారిగా మాడిసన్ ఆశ్చర్యపోయింది.

ఇక ప్రియుడు ఉంగరాన్ని అందించి ప్రపోజ్ చేయడంతో సంతోషంలో మునిగిపోయింది.

వెంటనే తన ప్రియుడు ప్రపోజ్‌కు ఓకే చెప్పింది.మే 29న న్యూయ్యార్క్‌లో జరిగిన ఈ ఘటనను కొందరు వీడియో తీశారు.తన ప్రియురాలు రేసు ముగించేంత వరకు అతడు వేచి ఉండడం చూసిన నెటిజన్లు అతడిని ప్రశంసిస్తున్నారు.

మోకాళ్లపై నిలబడి రింగ్ అందిస్తూ ప్రపోజ్ చేసిన తీరు ముచ్చట గొలుపుతోందని అభినందిస్తున్నారు.అతడి ప్రపోజ్ సినిమాలలో కంటే చాలా బాగుందని కామెంట్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube