వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం లో రూపొందిన కొండా సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొందిన కొండా సినిమా లో కొండా మురళి మరియు సురేఖ ల యొక్క ప్రేమ కథ మరియు వారి యొక్క రాజకీయం ఇతర విషయా లను కూడా ఈ సినిమా లో చూపించబోతున్నారు.
ప్రస్తుతం సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.వర్మ తన మార్క్ వివాదాస్పద ప్రమోషన్ ను ఈ సినిమా కు చేయడం లేదు.
ఒక వేళ కాస్త అటు ఇటుగా సినిమా ను ప్రమోషన్ చేసి హడావుడి చేస్తే ఖచ్చితంగా సినిమా విడుదల ఆగి పోయినా ఆశ్చర్యం లేదు.
అందుకే వర్మ కాస్త సైలెంట్ గానే ఈ సినిమా ను స్మూత్ గా ప్రమోట్ చేస్తున్నారని తెలుస్తోంది.
కాంగ్రెస్ లో ఉన్న కొండా దంపతులకు రాజకీయ ప్రత్యర్థులు చాలా మందే ఉంటారు.మొన్న ప్రీ రిలీజ్ కార్యక్రమం సందర్బంగానే ఆ విషయం క్లారిటీ వచ్చింది.కనుక వరంగల్ లో ఈ సినిమా ఎంత వరకు విడుదల అవుతుంది అనేది చాలా మందికి క్లారిటీ లేదు.అధికార పార్టీ నాయకులు కాస్త సీరియస్ గా తల్చుకుంటే సినిమా ను వరంగల్ లో విడుదల చేయకుండా ఆపుతారు.
కాని అలా చేయడం కు ఏ ఒక్కరు ఆసక్తి గా లేరని.అయినా కొండ సినిమా కు అడ్డుకోవాల్సినంత సీన్ ఏమీ లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.మొత్తానికి కొండా సినిమా కు సంబంధించినంత వరకు కాస్త కాంట్రవర్సీ అయితే ఉంటుంది కాని థియేటర్ల వద్ద హడావుడి మాత్రం పెద్దగా ఉండక పోవచ్చు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.వరంగల్ లో కూడా హడావుడి ఏమీ ఎక్కువ ఉండదు అని.అధికార పార్టీ తన అధికారంను ఉపయోగించి ఏమీ చేయక పోవచ్చు అనేది కొందరి అభిప్రాయం.