రష్మీపై సుధీర్ కు ఇంత ప్రేమా.. ఆమె ఎప్పటికీ హృదయంలో ఉంటుందంటూ?

బుల్లితెర క్రేజీ జోడి సుధీర్ రష్మి జోడీకి విపరీతమైన క్రేజ్ ఉంది.జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఫేమస్ అయిన ఈ జంట ఢీ ఈ కార్యక్రమంలో కూడా పెద్ద ఎత్తున సందడి చేశారు.

 Sudheer Loves Rashmi So Much That She Will Always Be In His Heart Sudheer Commen-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈ జోడికి విపరీతమైన అభిమానులు ఉన్నారు.ఇకపోతే జబర్దస్త్ వేదికగా పరిచయమైన వీరిద్దరూ బుల్లితెర పై పలు కార్యక్రమాలను పెద్దఎత్తున సందడి చేశారు.

ఈ క్రమంలోనే వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కవుట్ కావడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉంది అంటూ అభిమానులు పెద్ద ఎత్తున సందేహాలను వ్యక్తపరిచారు.అయితే తమ మధ్య ఎలాంటి రిలేషన్ లేదని కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే ఉంది అంటూ ఎన్నో సార్లు చెప్పుకొచ్చారు.

ఇకపోతే ప్రస్తుతం సుడిగాలి సుదీర్ ఈటీవీ కార్యక్రమాలకు దూరం కావడంతో రష్మి ఒంటరిగా మిగిలిపోయారు.

ఈ క్రమంలోనే వీరిద్దరు కలిసి ఒకే వేదికపై చేయకపోవడంతో అభిమానులు కూడా వీరిద్దరిని ఎంతగానో మిస్ అవుతున్నారు.

ఇలా రష్మీని వదిలేసి సుదీర్ అనసూయ, శ్రీముఖితో కలిసి చేస్తున్నారు.ప్రస్తుతం సుధీర్ జీ తెలుగు,స్టార్ మా వంటి ఛానెళ్లలో కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

ఇకపోతే తాజాగా తెలుగులో ప్రసారమౌతున్న దిల్ సే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ కార్యక్రమానికి ఫాదర్స్ డే సందర్భంగా ఎంతో మంది అతిథులు సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు.అందరి సమక్షంలో ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగినట్లు తెలుస్తోంది.

Telugu Rashmi, Sudheer, Sudheer Rashmi, Telugu, Tollywood-Movie

ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా సుడిగాలి సుదీర్ ఫ్యాన్స్ వేదికపైకి వచ్చి సందడి చేశారు.ఈ అభిమానులలో ఏడు సంవత్సరాల కుర్రాడు సుదీర్ ను బాబాయ్ అంటూ పిలిచాడు.ఇలా సుధీర్ ను బాబాయ్ అని పిలుస్తూనే రష్మీ పిన్ని ఎక్కడ ఉంది అంటూ అడిగారు.ఈ విధంగా కుర్రాడు రష్మి గురించి అడగడం తో ఒక్కసారిగా సుధీర్ ఎమోషనల్ అవుతూ తను నా గుండెల్లోనే ఉంది.

ఆమె ఎప్పటికీ మీకు కనపడదు అంటూ పై ఉన్న తన ప్రేమను ఈ సందర్భంగా సుధీర్ బయటపెట్టారు.ఇలా సుదీర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రష్మీను సుధీర్ ఎంతలా మిస్ అవుతున్నారో, తనపై ఎంత ప్రేమ ఉందో తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube