తాజాగా బిగ్ బాస్ నాన్ స్టాప్ షోలో గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ రసవత్తరంగా సాగింది.బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా ఎవరు నిలుస్తారు అన్న అభిమానుల ఆలోచనలకు తెరపడింది.
బిగ్ బాస్ నాన్ స్టాప్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ నుంచి అనిల్ రాథోడ్, బాబా భాస్కర్, అలాగే మిత్రశర్మ బయటకు వచ్చిన తర్వాత ఆట మరింత రసవత్తరంగా మారింది.ఆ తర్వాత బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడి, సునీల్ డబ్బుల బ్రీఫ్ కేస్ తో హౌస్ లోకి వెళ్లి డబ్బులతో బేరం చేశారు.
ఈ క్రమంలోనే అఖిల్ కప్పు కోసం వచ్చాను అని చెప్పగా బిందుమాధవి మాత్రం తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అవ్వడానికి వచ్చాను అని తెలిపింది.
అప్పుడు అరియానా డబ్బు కోసమే వచ్చానని ఒక ప్లాట్ ఫామ్ కొనాలి అన్న కోరికతోనే వచ్చాను అని చెప్పుకొచ్చింది.
తన ఆర్థిక కష్టాలన్నీ తీర్చుకునేందుకు, బిగ్ బాస్ ట్రోఫీ కూడా కొట్టాలని ఉద్దేశంతోనే బిగ్ బాస్ హౌస్ కి వచ్చినట్లు యాంకర్ శివ చెప్పుకొచ్చారు.ఇంతలో హౌస్ డబ్బుల బేరం మొదలవగా అందరూ సైలెంట్ గా ఉన్నా కూడా అరియానా మొత్తం డబ్బు ఎంత ఉండవచ్చు అని, డబ్బు తీసుకునేందుకు ఉత్సాహాన్ని చూపించింది.
అయితే అందులో డబ్బు ఎంత ఉంది అనే విషయాన్ని మాత్రం చెప్పకపోగా అందులో లక్షల్లో ఉంది అనే నాగార్జున మాట ఇచ్చిన తర్వాత అరియానా సూట్ కేస్ ని తీసుకుంది.
ఆ తర్వాత సూట్ కేస్ తో బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చిన అరియానా ని నాగార్జున, అనిల్, సునీల్ ఆటాడుకున్నారు.డబ్బు ఉంది అంటే ఎలా నమ్మి వచ్చావు అని అనడంతో సచ్చినోల్లారా మిమ్మల్ని నమ్మి వచ్చాను అంటూ సునీల్, అనిల్ లను తిట్టేసింది అరియానా.తరువాత చివరికి ఆ సూట్ కేసులో 10 లక్షలు ఉన్నాయి అని నాగార్జున చెప్పడంతో అరియానా ఊపిరి పీల్చుకుంది.
మొత్తానికి బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ రసవత్తరంగా సాగింది.