జీవిత డైరెక్షన్ లో రాజశేఖర్ హీరోగా నటించిన శేఖర్ మూవీ రేపు థియేటర్లలో విడుదల కానుంది.ఈ సినిమాకు భారీ స్థాయిలోనే స్క్రీన్లు దక్కాయని సమాచారం అందుతోంది.
అయితే ఈ సినిమాకు బుకింగ్స్ ఏ మాత్రం ఆశాజనకంగా లేకపోవడం గమనార్హం.హైదరాబాద్ లోని ఏఎంబీ సినిమాస్ లో ఏ సినిమాకు అయినా తొలిరోజు టికెట్లు దొరకడం కష్టమేనని చెప్పవచ్చు.అయితే ఈ సినిమాకు ఏఎంబీ సినిమాస్ లో రేపు ఉదయం 10.30 గంటల షోకు 40 కంటే ఎక్కువ టికెట్లు బుక్ కాలేదు.
ప్రసాద్ మల్టీప్లెక్స్ లో రేపు ఉదయం 11 గంటల షోకు కేవలం 21 టికెట్లు మాత్రమే బుకింగ్ అయ్యాయి.శేఖర్ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నా ఈ సినిమాకు బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం గమనార్హం.
ప్రముఖ థియేటర్లలోనే శేఖర్ సినిమాకు బుకింగ్స్ ఈ విధంగా ఉన్నాయంటే సాధారణ థియేటర్లలో శేఖర్ మూవీ బుకింగ్స్ ఎలా ఉన్నాయో సులభంగానే అర్థమవుతుంది.
శేఖర్ మూవీకి హిట్ టాక్ వస్తే మాత్రమే ఈ సినిమాకు బుకింగ్స్, కలెక్షన్లు పుంజుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
రాజశేఖర్ ఈ సినిమాతో కచ్చితంగా సక్సెస్ ను సొంతం చేసుకోవాల్సి ఉంది.ఈ సినిమాకు ఫ్లాప్ టాక్ వస్తే జీవితపై కూడా విమర్శలు వ్యక్తమయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
మలయాళంలో హిట్టైన జోసెఫ్ మూవీకి ఇది రీమేక్ కావడం గమనార్హం.
ఎప్పుడో షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా అనేకసార్లు వాయిదా పడి ఎట్టకేలకు థియేటర్లలో రిలీజవుతోంది.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.ఫుల్ రన్ లో ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్లు రాబడుతుందో చూడాలి.
ఈ సినిమాకు డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేసే ఆఫర్లు వచ్చినా మేకర్స్ ఒప్పుకోలేదు.