తెలంగాణ వైసీపీ మద్దతుదారుల మద్దతు టీఆర్ఎస్ కు లేనట్టేనా ? 

కొద్ది రోజుల క్రితం ఏపీ కి సంబంధించి తెలంగాణ మంత్రి , ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ఏపీలో పెద్దగా అభివృద్ధి చోటు చేసుకోలేదని , కరెంటు కోతలు ఎక్కువగా ఉన్నాయని, రోడ్లు అధ్వానంగా ఉన్నాయని , అక్కడ ఉండడం నరకప్రాయం అంటూ వ్యాఖ్యానించారు.

 Ycp Supporters In Telangana Dissatisfied With Trs Party Details, Ysrcp, Ap Gover-TeluguStop.com

అంతే కాదు తెలంగాణ ప్రజలను బస్సులో ఏపీ కి తీసుకు వెళ్లి చూపిస్తే తెలంగాణ లో ఎంత అభివృద్ధి చెందింది అనేది స్పష్టంగా అర్థమవుతుందని ఇలా ఎన్నో వ్యాఖ్యలు చేశారు.దీనిపై వైసీపీ ఘాటుగానే రియాక్ట్ అయింది.

ఈ మేరకు ఆ పార్టీ మంత్రులు,  ఎమ్మెల్యేలు , కీలక నాయకులు కేటీఆర్, టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మీడియా ముందు హడావుడి చేశారు.ఈ పరిణామాలు మరింత ముదిరాయి.

ఈ వ్యవహారం తమకు , తమ పార్టీకి డ్యామేజ్ చేస్తాయి అనే ఉద్దేశంతో కేటీఆర్ వెనక్కి తగ్గారు.
  తాను ఆ ఉద్దేశంతో అనలేదని , జగన్ తన సోదరుడు వంటి వాడని ఈ వివాదానికి పులిస్టాప్ పెట్టేసారు.

అయినా అక్కడ అక్కడ వైసీపీ నాయకులు కేటీఆర్ పై విమర్శలు చేస్తుండగా,  టీఆర్ఎస్ మంత్రులు సైతం ఏపీ పై విమర్శలు చేస్తూ, మరింత గా ఈ వివాదాన్ని పెంచే పనిలో పడ్డారు అయితే కేటీఆర్ వ్యాఖ్యలు తెలంగాణలో టిఆర్ఎస్ కూ ఇబ్బందికరంగానే మారాయి.తెలంగాణలో వైసిపి లేకపోయినా , ఆ పార్టీకి కొన్ని ప్రాంతాల్లో గట్టి పట్టు ఉంది.

ఇప్పటివరకు టిఆర్ఎస్ వైసిపి మధ్య స్నేహ సంబంధాలు కొనసాగుతుండటం వంటి కారణాలతో జగన్ , వైసిపి అభిమానులు తెలంగాణలో టిఆర్ఎస్ కు అనుకూలంగా ఉంటూ వస్తున్నారు.అలాగే తెలంగాణలోని రెడ్డి సామాజిక వర్గం ను జగన్ ను దృష్టిలో పెట్టుకుని టిఆర్ఎస్ కు మద్దతు పలుకుతూ వస్తున్నారు.

కానీ ఇప్పుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో ఆ మద్దతు టిఆర్ఎస్ కు దూరమైందనే చెప్పాలి.
 

Telugu Ap, Chandrababu, Cm Jagan, Jagan, Ktr Ap, Reddy Category, Trs, Trs Suppor

ఒక వైపు చూస్తే ఎన్నికలకు ఇంకా ఎంతో సమయం లేదు.అదీ కాకుండా టిఆర్ఎస్ నేత తెలంగాణ సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు.అదే గనుక జరిగితే ఈ డిసెంబర్ లోనే ఎన్నికలు జరిగే అవకాశం  ఉన్న నేపథ్యంలో అనవసర వ్యాఖ్యలు చేయడం ద్వారా కేటీఆర్ వైసిపి మద్దతుదారులు ఆగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది.

అంతే కాదు ఆ ప్రభావం టిఆర్ఎస్ ఓటు బ్యాంకు పైన తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది.జగన్ సోదరి వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టినా,  జగన్ మద్దతుదారులు అటువైపు వెళ్లలేదు.

మెజారిటీ స్థాయిలో టిఆర్ఎస్ కు మద్దతు పలుకుతూ వస్తున్నారు.ఇటువంటి సమయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కారణంగా ఇప్పుడు వారంతా టిఆర్ఎస్ కు దూరమయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube