దాదాపుగా మూడు సంవత్సరాల తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ థియేటర్లలో విడుదలైంది.ఆర్ఆర్ఆర్ రిలీజ్ తో తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం నెలకొంది.
ఆర్ఆర్ఆర్ మూవీకి ఈ ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీ అనే తేడాల్లేకుండా అందరినుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.అయితే కొందరు ఫ్యాన్స్ అత్యుత్సాహం ఆర్ఆర్ఆర్ మేకర్స్ కు తలనొప్పిగా మారింది.
చాలామంది సినిమా చూస్తున్న సమయంలో మొబైల్ లో ముఖ్యమైన సీన్లను తీస్తూ సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నారు.
ఫలితంగా సినిమాలోని ముఖ్యమైన సన్నివేశాలన్నీ సోషల్ మీడియాలో లీకవుతూ ఉండటంతో కొంతమంది సినిమాను చూడటానికి ఆసక్తి చూపడం లేదు.
మేకర్స్ కు ఈ విధంగా కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోందని తెలుస్తోంది.సోషల్ మీడియాలో వీడియోలను అప్ లోడ్ చేసేవాళ్లు ఇది కూడా ఒక రకమైన పైరసీ అని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.
కొంతమంది వాట్సాప్ స్టేటస్ లలో ముఖ్యమైన సన్నివేశాలను పెడుతున్నారు.
సోషల్ మీడియా వినియోగం పెరిగిన తరుణంలో కొంతమంది ఫ్యాన్స్ అత్యుత్సాహం నిర్మాతలకు కొత్త తలనొప్పులను తెచ్చిపెడుతోంది.
సినిమా చూడాలని రేపు, ఎల్లుండికి టికెట్లను బుకింగ్ చేసుకున్న వాళ్లకు సైతం ఇలా లీకవుతున్న వీడియోల వల్ల చిరాకు కలుగుతోంది.యూట్యూబ్ లో కూడా పదుల సంఖ్య థియేటర్ లో చిత్రీకరించిన ఆర్ఆర్ఆర్ వీడియోలు దర్శనమిస్తున్నాయి.
ఆర్ఆర్ఆర్ టీం ఇప్పటికే రంగంలోకి దిగి పైరసీ లింక్ లను తొలగిస్తున్నా ఎక్కువ సంఖ్యలో లింక్స్ ఉండటం నిర్మాతలకు తలనొప్పిగా మారింది.ఈ విధంగా సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేయడంతో గతంలో పలు సినిమాలు నష్టపోయాయి.మరోవైపు ఆర్ఆర్ఆర్ మూవీని పైరసీ కూడా టెన్షన్ పెడుతోంది.పెద్ద సినిమాలు పైరసీ వల్ల ప్రతి సంవత్సరం కోట్ల రూపాయలు నష్టపోతున్నాయనే సంగతి తెలిసిందే.