రాజమౌళి డైరక్షన్ లో ఎన్.టి.
ఆర్, రాం చరణ్ కలిసి నటించిన ఆర్.ఆర్.ఆర్ సినిమా మరో వారం రోజుల్లో రిలీజ్ కాబోతుంది.మార్చ్ 25న వరల్డ్ వైడ్ గా భారీగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా గురించి ప్రస్తుతం చిత్రయూనిట్ పీక్స్ లో ప్రచారం చేస్తుంది.
సినిమాలో ఎన్.టి.ఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రలో నటించారు.
కొమరం భీమ్ పాత్రలో తారక్ తన నట విశ్వరూపం చూపించాడని తెలుస్తుంది.
ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ కి పులితో ఫైట్ ఉంటుందని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది.అయితే పులితోనే కాదు అనకొండతో కూడా భీమ్ సీన్ హైలెట్ గా ఉంటుందని అంటున్నారు.
సినిమాలో తారక్ ఎలివేషన్ సీన్స్ నెక్స్ట్ లెవల్ లో ఉంటాయని చెబుతున్నారు.అయితే ఆ పాత్రకి ఏమాత్రం తగ్గకుండా చరణ్ రోల్ ఉంటుందని టాక్.మొత్తానికి తారక్, చరణ్ కలిసి చేసిన ఆర్.ఆర్.ఆర్ ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేయాలని చూస్తున్నారు. సినిమా కొన్నాళ్లుగా వాయిదా పడుతూ రాగా వచ్చే శుక్రవారం భారీ రిలీజ్ ఫిక్స్ చేశారు.
వారం రోజుల ముందుగానే సినిమాని ప్రమోట్ చేస్తున్నారు.