ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ డైరక్షన్ లో తెరకెక్కిన రాధేశ్యామ్ సినిమా లాస్ట్ వీక్ రిలీజైన విషయం తెలిసిందే.ఎన్నో భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ప్రేక్షకులు నిరాశ చెందారు.
సినిమా వారం రోజుల్లో సాధించిన వసూళ్లు చూస్తేనే రాధేశ్యామ్ సినిమా రిజల్ట్ ఏంటి అన్నది అర్ధమవుతుంది.ఇక ఈ సినిమాకి వచ్చిన డివైడ్ టాక్ పై ఫస్ట్ టైం ఆ సినిమా హీరోయిన్ పూజా హెగ్దే స్పందించింది.
సినిమాలో నటించిన యాక్టర్స్ కి ఆ సినిమా పట్ల ఓ సెపరేట్ ఎఫెక్షన్ ఉంటుంది.
ఈ క్రమంలో రాధేశ్యామ్ సినిమాపై పూజా హెగ్దే తన అభిమానాన్ని చాటుకుంది.
కొన్ని సినిమాలు ప్రేక్షకులకు నచ్చినా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లని రాబట్టలేవని.కొన్ని సినిమాలు టాక్ బాగా లేకపోయినా సరే కలక్షన్స్ బాగా తెస్తాయని.
అవి తర్వాత చూశాక కానీ సినిమా ఎంత బాగుంది అన్నది అర్ధమవుతుందని అంటుంది పూజా హెగ్దే.రాధేశ్యామ్ సినిమా ఫలితంపై పూజా ఈ విధంగా రియాక్ట్ అవడం చూస్తుంటే సినిమా ప్రేక్షకులకు రీచ్ అవలేదు అని అమ్మడు ఒప్పుకున్నట్టే అని అంటున్నారు.
రాధే శ్యామ్ టీం ఇంకా సినిమాని సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తుండటం విశేషం.