1.ఉక్రెయిన్ లో భారత విద్యార్థి మృతి పై దర్యాప్తు
ఉక్రెయిన్ లో భారత విద్యార్థి నవీన్ శేఖరప్ప మృతి పై దర్యాప్తు చేస్తామని రష్యా బుధవారం పేర్కొంది.
2.కీవ్ లోని భారత దౌత్య కార్యాలయం మూసివేత
ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో భారతీయులు ఎవరూ లేరని నిర్ధారించుకున్న నేపథ్యంలో భారత దౌత్య కార్యాలయం ను మూసివేశారు.
3.రష్యా హెచ్చరిక
మూడో ప్రపంచ యుద్ధం అంటూ జరిగితే అది అణు యుద్దమేనని రష్యా విదేశాంగ శాఖ మంత్రిప్రపంచ దేశాలను హెచ్చరించారు.
4.ఉక్రెయిన్ లో మరో భారతీయ విద్యార్థి మృతి
ఉక్రెయిన్ లో మరో భారతీయ విద్యార్థి మృతి చెందాడు.పంజాబ్ కు చెందిన 22 ఏళ్ల చందన్ జిందాల్ అనే విద్యార్థి అనారోగ్యం కారణంగా మృతి చెందాడు.
5.ఆస్ట్రేలియా ప్రధానికి కరోనా పాజిటివ్
ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.ప్రస్తుతం ఆయన ఐసోలేషన్ లో ఉన్నారు.
6.భారత ఎంబసీ కీలక సూచన
నాలుగు గంటల్లోగా ఖార్కీవ్ ను ఖాళీ చేయాలని భారత విద్యార్థులను ఇండియన్ ఎంబసీ సూచించింది.
7.రష్యా పై ఉక్రెయిన్ ఫిర్యాదు .ఐసీజే లో విచారణ
రష్యా పై ఉక్రెయిన్ అంతర్జాతీయ న్యాయ స్థానం లో ఫిర్యాదు చేసింది.
తాజా వార్తలు