లాస్ ఏంజెల్స్ శివరాత్రి వేడుకల్లో పాల్గొన్న ప్రియాంక చోప్రా దంపతులు!

దేశవ్యాప్తంగా మార్చి 1వ తేదీ శివరాత్రి వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు.దేశవ్యాప్తంగా ఉన్న అన్ని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి.

 Priyanka Chopra Couple Participates In Los Angeles Shivratri Celebrations , Priy-TeluguStop.com

ఈ క్రమంలోనే సెలబ్రిటీలు సైతం పెద్ద ఎత్తున శివరాత్రి వేడుకలలో పాల్గొన్నారు.ఇకపోతే గ్లోబల్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రియాంక చోప్రా మన దేశం విడిచి లాస్ ఏంజెల్స్ లో నివసిస్తున్నప్పటికీ ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలను ఏమాత్రం మర్చిపోలేదని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే తన భర్తతో కలిసి ప్రియాంక చోప్రా పెద్దఎత్తున శివరాత్రి వేడుకల్లో పాల్గొన్నారు.

ఇదివరకే ప్రియాంక చోప్రా ఓ ఇంటర్వ్యూలో భాగంగా తాను ఎంత గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ భారతీయ మూలాలను ఎప్పటికీ మర్చిపోననే విషయాన్ని వెల్లడించిన సంగతి మనకు తెలిసిందే.అయితే శివరాత్రి వేడుకల్లో పాల్గొనడం చూస్తుంటే తను సంస్కృతి సాంప్రదాయాలకు కట్టుబడి ఉన్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే శివరాత్రి సందర్భంగా లాస్ ఏంజిల్స్ లోని తన నివాసంలో ఘనంగా శివరాత్రి వేడుకలు జరుపుకున్నారు.

ఈ దంపతులిద్దరూ సాంప్రదాయ దుస్తులను ధరించి శివుడికి పూజ చేసినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈ ఘటనకు సంబంధించిన ఒక ఫోటోని ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.హరహర మహాదేవ్​.శివరాత్రి జరుపుకుంటున్న అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు.ఓం నమః శివాయ అంటూ.శివుడి విగ్రహానికి పూజ చేస్తున్న ఫొటోను షేర్​ చేసింది.

ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది ఈమె పై ప్రశంసలు కురిపిస్తున్నారు.విదేశంలో ఉన్నా కూడా సంస్కృతి సంప్రదాయాలను మర్చిపోకుండా ఆచరిస్తున్నందుకు పలువురు ప్రియాంక చోప్రా పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube