లాస్ ఏంజెల్స్ శివరాత్రి వేడుకల్లో పాల్గొన్న ప్రియాంక చోప్రా దంపతులు!

దేశవ్యాప్తంగా మార్చి 1వ తేదీ శివరాత్రి వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు.దేశవ్యాప్తంగా ఉన్న అన్ని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి.

ఈ క్రమంలోనే సెలబ్రిటీలు సైతం పెద్ద ఎత్తున శివరాత్రి వేడుకలలో పాల్గొన్నారు.ఇకపోతే గ్లోబల్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రియాంక చోప్రా మన దేశం విడిచి లాస్ ఏంజెల్స్ లో నివసిస్తున్నప్పటికీ ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలను ఏమాత్రం మర్చిపోలేదని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే తన భర్తతో కలిసి ప్రియాంక చోప్రా పెద్దఎత్తున శివరాత్రి వేడుకల్లో పాల్గొన్నారు.

"""/"/ ఇదివరకే ప్రియాంక చోప్రా ఓ ఇంటర్వ్యూలో భాగంగా తాను ఎంత గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ భారతీయ మూలాలను ఎప్పటికీ మర్చిపోననే విషయాన్ని వెల్లడించిన సంగతి మనకు తెలిసిందే.

అయితే శివరాత్రి వేడుకల్లో పాల్గొనడం చూస్తుంటే తను సంస్కృతి సాంప్రదాయాలకు కట్టుబడి ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే శివరాత్రి సందర్భంగా లాస్ ఏంజిల్స్ లోని తన నివాసంలో ఘనంగా శివరాత్రి వేడుకలు జరుపుకున్నారు.

"""/"/ ఈ దంపతులిద్దరూ సాంప్రదాయ దుస్తులను ధరించి శివుడికి పూజ చేసినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఈ ఘటనకు సంబంధించిన ఒక ఫోటోని ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.

హరహర మహాదేవ్​.శివరాత్రి జరుపుకుంటున్న అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు.

ఓం నమః శివాయ అంటూ.శివుడి విగ్రహానికి పూజ చేస్తున్న ఫొటోను షేర్​ చేసింది.

ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది ఈమె పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

విదేశంలో ఉన్నా కూడా సంస్కృతి సంప్రదాయాలను మర్చిపోకుండా ఆచరిస్తున్నందుకు పలువురు ప్రియాంక చోప్రా పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

రెడ్ బుక్ పై లోకేష్ ఏమంటున్నారంటే ..?