టాలీవుడ్ రౌడీ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ.రోజురోజుకూ ఆయన అభిమానుల సంఖ్య పెరిగిపోతుంది.
విజయ్ దేవరకొండకు టాలీవుడ్ లో మాత్రమే కాదు బాలీవుడ్ లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగి పోతుంది.ఆయన ప్రతి ఒక్కరికి ఫేవరేట్ హీరోగా మారి పోతున్నాడు.
ఈయన త్వరలోనే లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్‘ సినిమా తెరకెక్కుతుంది.
మొదటి సారి పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు విజయ్ ఇంకా పూరీ.ఈ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో విజయ్ మరింత స్టార్ డమ్ ను పెంచుకోవాలని చూస్తున్నాడు.
లైగర్ సినిమాను వచ్చే ఏడాది ఆగస్టు 25న విడుదల చేయబోతున్నట్టు అనౌన్స్ చేసారు.ఈ సినిమా కోసం గత రెండు ఏళ్లగా కష్టపడుతున్నాడు విజయ్.
మధ్యలో కరోనా కూడా రావడంతో ఈ సినిమా షూటింగ్ కు అంతరాయం కలిగింది.
దీంతో ఈ సినిమా కోసం విజయ్ గత రెండేళ్లుగా ఒకే గెటప్ తో కనిపించాడు.కానీ ఇప్పుడు లైగర్ సినిమా షూటింగ్ ముగియడంతో విజయ్ కొత్తగా మేకోవర్ అయ్యాడు.ఇన్నాళ్లు ఈయన పొడవాటి జుట్టుతో కనిపించగా ఇప్పుడు మాత్రం కొత్తగా మేకోవర్ అయ్యాడు.
తాజాగా ఈయన వాలీబాల్ లీగ్ కోసం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం లో సందడి చేసాడు.
దీనికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ఈ ఫోటో విజయ్ ఫ్యాన్స్ ను ఆకర్షిస్తుంది.రెండేళ్ల తర్వాత కొత్త లుక్ లో మేకోవర్ అవ్వడానికి జనగణమన సినిమానే కారణం అని తెలుస్తుంది.
ఈ సినిమా తర్వాత కూడా విజయ్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కే జనగణమన సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా కూడా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.