తమిళ స్టార్ హీరో అజిత్ గురించి మనందరికీ తెలిసిందే.అజిత్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా వలిమై.
బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ నిర్మించిన ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహించారు.ఈ సినిమాలో టాలీవుడ్ హీరో కార్తికేయ నటించిన విషయం తెలిసిందే.
ఈ సినిమా ఈ నెల 24 పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానుంది.సినిమా విడుదల తేది దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.
సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా కార్తికేయ మీడియాతో మాట్లాడుతూ హీరో అజిత్ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
దర్శకుడు హెచ్ వినోద్ ఆర్ఎక్స్ 100 సినిమా చూసి వలిమై సినిమా కోసం తనను సంప్రదించారని, 2019 అక్టోబర్ లో తొలిసారి తనకు ఫోన్ వచ్చిందని తెలిపారు.
అజిత్ సార్ తో ఒక సినిమా చేస్తున్నాం అందులో ఒక పవర్ ఫుల్ విలన్ పాత్ర ఉంది.హీరో ఇమేజ్ తో పాటు ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉన్న నటుడు కావాలి.
మీ లుక్, ఫిజిక్ బాగుంది.ఈ పాత్ర మీకు సరిగ్గా సరిపోతుంది చేస్తారా అని అడగగా.
మొదట కథ పాత్ర గురించి చెప్పండి అని అన్నాను.అప్పుడు వాళ్ళ అసిస్టెంట్ ని పంపించి స్క్రిప్టు వినిపించారు కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాను అని చెప్పుకొచ్చాడు కార్తికేయ.
ఇక ఈ సినిమాలో యాక్టింగ్ కు స్కోప్ ఉంటుంది అని అనిపించి.అందులోనూ అజిత్ కొడుకు విలన్ కాబట్టి నా పాత్ర మరింత బలంగా తీర్చిదిద్దారు.
ఈ సినిమాతో తమిళంలో మంచి గుర్తింపు వస్తుంది అని భావిస్తున్నాను అని కార్తికేయ తెలిపారు.ఇక ఆ సినిమా షూటింగ్ సమయంలో రేసింగ్ ఎపిసోడ్స్ చిత్రీకరిస్తుండగా.హీరో అజిత్ కు యాక్సిడెంట్ అయ్యింది అని.బైక్ రైడ్ చేస్తూ అదుపు తప్పి పడిపోయాడని.పెద్ద దెబ్బలు తగిలాయని.ఆ విషయాన్ని ఎవరికీ చెప్పక పోగా.మామూలుగా బైకును లేపి పక్కకు తీసుకొని వచ్చేసారు.అప్పుడు నేను అక్కడే ఉన్నాను.
తర్వాత విషయం తెలిసి ఎందుకు అంత రిస్కు రెండు రోజులు విశ్రాంతి తీసుకోవచ్చు కదా అని అడగగా.అప్పుడు అజిత్ ఇప్పుడు నీ డేట్స్ ఉన్నాయి.
మళ్లీ నీకు కష్టం అవుతుంది అలాగే ఫైట్ మాస్టర్ డేట్స్, లొకేషన్ ఖర్చులు మళ్ళీ తిరిగి రావడానికి పోవడానికి ఇవన్నీ ఎందుకు అందరికీ ఇబ్బందే కదా.కాబట్టి ఒక్క రోజు నేను ఓపిక పడితే సరిపోతుంది అని అన్నారని హీరో కార్తికేయ చెప్పుకొచ్చారు.