ప్రకాష్ రాజ్ సినిమాల్లోకి రాక ముందు నాటకాలు వేసేవాడు.కొంత కాలం తర్వాత సీరియల్స్ చేశాడు.
సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేసేవాడు.అందులో భాగంగానే ఓ ఆర్ట్ సినిమా చేశాడు.
ఈ సినిమా సమయంలో నటి గీతతో పరిచయం కలిగింది.ప్రకాష్ రాజ్ నటన చూసి ఆమె ఆశ్చర్యపోయింది.
నీలో టాలెంట్ చాలా ఉంది.వెళ్లి బాలచందర్ ను కలవొచ్చు కదా అని చెప్పింది.
కొద్ది రోజుల తర్వాత చెన్నైలో బాలచందర్ ను కలిశాడు.ఆయన నాటకాల గురించి, సాహిత్యం గురించి మాట్లాడారు.10 నిమిషాలు సమయం ఇచ్చి ఏకంగా రెండున్నర గంటల సేపు మాట్లాడారు.తాను త్వరలో జాజిమల్లి సినిమా చేస్తున్నాను.
అందులో నీకు వేషం ఇస్తానని చెప్పాడు.రెండు మూడు రోజుల తర్వాత ఆ క్యారెక్టర్ కు మరొకరిని తీసుకున్నట్లు చెప్పాడు.
ఆ తర్వాత ప్రకాష్ రాజ్ బెంగళూరుకు వెళ్లాడు.
ఏడాది తర్వాత బాల చందర్ నుంచి ప్రకాష్ రాజ్ కు ఫోన్ వచ్చింది.
ఏం లేదు.ఓ సినిమాలో వేషం ఉంది.
చేస్తావేమోనని కాల్ చేశా అన్నాడు.చేస్తానని చెప్పి చెన్నైకి వెళ్లాడు ప్రకాష్ రాజ్.
బాల చందర్ దర్శకత్వంలో డ్యుయెట్ అనే సినిమా షూటింగ్.వైజాగ్ లో తొలి షాట్ తీశారు.
ఆ సమయంలో శరత్ బాబు, ప్రకాష్ రాజ్ మధ్య కొన్ని సీన్లు ఉంటాయి.అప్పుడు ప్రకాష్ రాజ్ చెప్పిన డైలాగ్ బాలచందర్ కు బాగా నచ్చుతుంది.
వెంటనే ఆయన సీన్లు మార్చాడు.అంతేకాదు.
ముందు అనుకున్నదాని కంటే 15 సీన్లు ప్రకాష్ రాజ్ మీద ఎక్కువ తీశారు.ఆ తర్వాత కొన్ని సీన్లను తీసేసినట్లు చెప్పాడు దర్శకుడు.
ప్రకాష్ రాజ్ కు చాలా బాధ కలిగింది.పర్వాలేదు లెండి సర్ అన్నాడు.
వెంటనే బాలచందర్ మెచ్చుకుంటూ… ఇదిరా స్పోర్టివ్ నెస్ అంటూ భుజం తట్టాడు.
సినిమా అయ్యాక.తొలుత కొంత మంది చూశారు.ఎలా ఉందిరా సినిమా అని బాల చందర్ ప్రకాష్ రాజ్ ను అడిగాడు.
ఇది చాలు సర్.ఇక బతికేస్తాను అని చెప్పాడు.ఆ తర్వాత ప్రకాష్ రాజ్ కు చాలా అవకాశాలు వచ్చాయి.బిజీ ఆర్టిస్టుగా మారిపోయాడు.