తిన్న ఇంటికె కన్నం వేసిన భారత సంతతి వ్యక్తికి అమెరికా కోర్టు జైలు శిక్ష విధించింది అంతేకాదు భారీ జరిమానా కట్టాలని ఆదేశించింది.అతడితో పాటు హైదరాబాద్ కి చెందిన ఓ యువకుడిని త్వరలోనే ఈ కేసు విషయంలో విచారణ చేసి అతడిపై కూడా అభియోగ పత్రం నమోదు చేయనుంది అమెరికాకు చెందిన FBI.
ఇంతకీ అసలేం జరిగింది.హైదరాబాద్ యువకుడికి అమెరికాలో జరిగిన ఓ నేరానికి సంభంధం ఏంటి అనే వివరాలలోకి వెళ్తే.
అమెరికాలోని కాలిఫోర్నియా కి చెందిన భారత సంతతి యువకుడు కడిమిశెట్టి రోహిత్ అనే వ్యక్తి అమెజాన్ లో పనిచేసే వాడు.ఎంతో టాలెంట్ ఉన్న రోహిత్ ప్రతిభకు అనతికాలంలోనే అమెజాన్ ఉన్నత స్థానంలో కూర్చోపెట్టింది.
అంతేకాదు భారీ జీతం కూడా ఆఫర్ చేసింది.అయితే అత్యధిక డబ్బు సంపాదించాలనే ఆశతో రోహిత్ అన్నం పెట్టిన సంస్థనే మోసం చేయడం మొదలు పెట్టాడు.
అతడి మోసాన్ని గమనించిన అమెజాన్ అతడిని సంస్థ నుంచీ తొలగించింది.అమెజాన్ నుంచీ బయటకు రాగానే అతడు నలుగురితో కలిసి భారత్ లోని అమెజాన్ సంస్థ నుంచీ అక్కడి ఉద్యోగుల సాయంతో కీలక సమాచారం దొంగిలిచాడు, అంతేకాదు ఎంతో మంది అమెజాన్ కస్టమర్స్ ను మోసం చేశారు.
ఇందుకుగాను హైదరాబాద్ కి చెందిన కుంజు నిషాద్ అనే వ్యక్తి సాయం చేశారని సంస్థ కోర్టుకు తెలిపింది.కుంజు నిషాద్ ను విచారణ చేయాల్సి ఉందని ఆ తరువాత అతడిపై చార్జ్ షీట్ నమోదుచేస్తామని FBI కోర్టుకు తెలిపింది.ఇదిలాఉంటే
అమెజాన్ నుంచీ తొలగించిన తరువాత కూడా అతడు అమెజాన్ ఉద్యోగిగా పలువురుని మోసం చేశాడని దాంతో సంస్థ పరువుకు భారీ నష్టం వచ్చిందని పేర్కొంది.సంస్థ ఫిర్యాదుతో రోహిత్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టు ముందు హాజరు పరుచాగా రోహిత్ తన తప్పులను ఒప్పుకున్నాడు.దాంతో కోర్టు రోహిత్ కి అతడి అమెరికాలో సహకరించిన నలుగురికి 10 నెలల జైలు శిక్ష విధించింది.