గులాబీ బాస్, సీఎం కేసీఆర్ ఇటీవల కాలంలో చేసిన వ్యాఖ్యలు దుమారాన్నే లేపుతున్నాయి.కేంద్ర బడ్జెట్‌పై ఒక రేంజ్‌లో విమర్శల జల్లులు కురిపించాడు.
అంతకుముందు కూడా రాజ్యాంగాన్ని మార్ఛాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.వీటి పట్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల విమర్శలు వెల్లువెత్తాయి.
ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా ఘాటుగా విమర్శలు చేశారు.సీఎంకు ఉన్నట్టు ఉండి ఏం అవసరం వచ్చిందంటూ హితవు పలికారు.
ఇతనికంటే తానేమీ తక్కువ కాదన్నట్టు బీజేపీ నేత, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అయితే చెప్పనక్కర్లేదు.గతం నుంచి ఏమాత్రం అవకాశం దొరికినా మెడకు కత్తి పెట్టినట్టే వ్యవహరిస్తున్నాడు.
ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఉతికారేసినంత పనిచేశాడు.మార్చాల్సింది రాజ్యాంగాన్ని కాదని, సీఎం కేసీఆర్‌నే మార్చాలని విరుచుకుపడ్డారు.
ప్రజా స్వామ్య తెలంగాణ నిర్మాణం, టీఆర్ఎస్ ముక్త్ తెలంగాణ కోసం తాము పోరాటం చేస్తున్నామని తెలిపారు.తెలంగాణ ప్రజలంతా తమతో కలిసి నడవాలని కోరారు.
రాజ్యంగం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసీఆర్‌కు నిరసనగా శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ నుంచి పార్లమెంట్ వరకు బీజేపీ నేతలతో కలిసి పాదయాత్ర చేపట్టారు.అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేయగా ఆయన కేసీఆర్ పట్ల ఘాటు వ్యఖ్యలు చేశారు.
రాజ్యంగం మార్చాలన్న కేసీఆర్ స్టేట్‌మెంట్స్ ఆయన అహంకారానికి నిదర్శనంగా నిలుస్తాయని అన్నారు.
టీఆర్ఎస్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.దళిత సీఎం, దళితబంధు, దళితులకు మూడెకరాల భూమి ఇవ్వాలని రాజ్యంగంలో రాసి ఉందా అని టీఆర్ఎస్ నేతలు ప్రశ్నించడాన్ని గుర్తు చేశారు.మరి ఓడిపోయిన బిడ్డను తీసుకొచ్చి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని రాజ్యాంగలో రాసుందా… రాత్రిపూట మందు గోళీలు ఇచ్చే వ్యక్తికి రాజ్యసభ సీటు, మందులో సోడా పోసే వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వాలని రాజ్యాంగంలో రాసుందా అని ఉపోద్ఘాటించారు.
మరి టీఆర్ ఎస్ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.